లెస్బియన్ల కథలు ఇంటిముందుకు వచ్చేస్తున్నాయ్ - ఇ ట్స్ నాట్ మై ఫాల్ట్ అంటోన్న దర్శకుడు
శృంగారాన్ని నలుగురి ముందు పలకడమే తప్పుగా భావించే సంప్రదాయాలు చెరిగిపోతున్నాయి. జీవితంలో అదీ ఒకే భాగమే అంటూ యువత కట్టలు తెంచుకుని బయటకు వస్తున్నారు. ఓటీటీ వచ్చాక ఇంటిముందు లెస్బియన్ల శృంగా కథలు పరిచయం చేస్తున్నారు. గతంలో నెట్‌ప్లిక్స్ వంటి వాటిల్లో రాత్రుళ్ళ శృంగారంతో సెపరేట్‌గా సినిమాలు వచ్చేవి. ఇప్పుడు సామాన్య జీవితంలో ఓభాగం అయిపోయాయి.
ఇటీవలే ఆహా!లో నటి ఝన్సీ ఓ సినిమాలో నటించింది. ఆమె కుమార్తె లెన్స్‌బియన్. ఇంట్లో అన్నకు, ఆమె తండ్రికి తెలిసినా భార్యకు చెప్పడు. ఓ సందర్భంలో ఝాన్సీనే కళ్ళారా చూస్తుంది. ఆమె అవాక్కవుతుంది. కూతుర్ని ఇంటినుంచి వెల్లగొట్టేంత పనిచేస్తుంది. ఆ సమయంలో పక్కింటిలో వున్న ఝాన్సీ స్నేహితురాలు వచ్చి ఝన్సీకి లిప్‌కిస్ ఇస్తుంది. ఇదీ ఇద్దరు అమ్మాయిల ప్రేమంటే అని రుచి చూపిస్తుంది. దాంతో ఝాన్సీ ఒప్పుకున్నట్లే అని దర్శకుడు ముగించాడు.
ఇప్పుడు ఓటీటీ వల్ల ఇలాంటి కథలు మరిన్నిగా వచ్చేస్తున్నాయి. తాజాగా తమిళ హీరోయిన్లు గౌరీకిషన్ - అనఘలు కలిసి ఓ స్వలింగ సంపర్క ఆల్బమ్‌లో నటించారు. ఎల్‌జీబీటీలుగా పిలిచే స్వలింగ సంపర్కుల గురించి సమాజంలో అవగాహన కల్పించే నిమిత్తం ఈ ఆల్బమ్‌ను రూపొందించారు. మగిళిని అనే పేరుతో రూపొందించిన ఈ ఆల్బమ్‌కు విజి. బాలసుబ్రమణియన్ దర్శకత్వం వహించగా, మదన్ కార్కి గేయరచన చేశారు. గోవింద్ వసంత్ స్వరాలు సమకూర్చారు. అరుణ్‌కృష్ణ కెమెరామెన్‌గా పనిచేశారు.
ఇందులో కాప్షన్ ఏమంటే.. ఇ ట్స్ నాట్ మై ఫాల్ట్/ అవర్ ఫాల్ట్ అంటూ వేయడం జరిగింది. మరి ఎవరి ఫాల్ట్ అనేది పూర్తిగా చూసి తెలుసుకోవాల్సిందేనని దర్శకుడు