గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 18 అక్టోబరు 2018 (16:24 IST)

అత్తారింట్లో స్టైలిష్ స్టార్ దసరా సందడి

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. దసరా పండుగకు తన అత్తగారింటికి వెళ్లారు. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి అమ్మమ్మ స్వగ్రామమైన నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలోని చింతపల్లి గ్రామం. ఈ గ్రామానికి ఆయన తన భార్యాపిల్లలతో కలిసి వెళ్లి సందడి చేశారు.
 
వెండితెరపై కనిపించే హీరో అల్లు అర్జున్ తమ కళ్లెదుటకు వచ్చాడని తెలియడంతో.. ఆయన అత్తగారింటి వద్ద సందడి నెలకొంది. గ్రామస్తులంతా అల్లు అర్జున్ చూసేందుకు పరుగులు తీశారు. కొందరు యువకులైతే బన్నీతో సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. దసరా శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ బన్నీ ధన్యావాదాలు తెలిపారు.