ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 25 జనవరి 2025 (12:28 IST)

దేవుడు ఉన్న చోట దెయ్యం ఉంటుంది అంటూన్న సుధీర్ బాబు

Sudheerbabu new movie
Sudheerbabu new movie
కథానాయకుడు సుధీర్ బాబు సక్సెస్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. భిన్నమైన పాత్రలు పోషిస్తూ సక్సెస్ తో సంబంధం లేకుండా కష్టపడి సినిమాలు చేస్తున్నాడు. మామా మశ్చీంద్ర, హరోం హర, మా నాన్న సూపర్‌హీరో వంటి భిన్నమైన కథలతో వచ్చారు.  అందులో హరోం హర సినిమా సుధీర్ బాబుకు బాగా నచ్చిన సినిమా. తాజాగా కొంతకాలం గేప్ తీసుకున్న ఆయన తాజాగా శివతత్త్వం నేపథ్యంలో సినిమా రాబోతుంది. ఇందుకు సంబంధించిన శివలింగం పోస్టర్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు సుధీర్ బాబు.
 
దేవుడు ఉన్న చోట దెయ్యం ఉంటుంది కానీ అంతకు ముందు నమ్మకం ఉంటుంది. బిగ్ రివీల్ అలర్ట్!  రేపు భారీ ప్రకటన కోసం సిద్ధంగా ఉండండి!  ఉత్తేజకరమైన వార్తల కోసం చూస్తూ ఉండండి! అంటూ పేర్కొన్నారు. జీస్టూటడియోస్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకు ప్రేరణా అరోరా, ఉమేష్ Kr బన్సాల్,  అంజలిరైనా, గిరిష్‌జోహార్, కేజ్రీవాలాక్షయ్, దేశ్‌ముఖ్‌ప్రగతి, సాగర్ అంబ్రే, సాగర్ అంబ్రే సాంకేతిక సిబ్బంది.  ఈ సినిమా గురించి మరిన్నివివరాలు త్వరలో తెలియజేయనున్నట్లు సుధీర్ బాబు తెలిపారు. కాగా, పుల్లెల గోపీచంద్ బయోపిక్ కోసం ప్రయత్నాలు చేస్తున్నా కొలిక్కి రాలేదు. అందుకే దానిని ప్రస్తుతానికి పక్కన పెట్టారు.