ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఎం
Last Modified: శుక్రవారం, 2 జులై 2021 (10:45 IST)

ఆర్థిక సమస్యలతో దంపతుల ఆత్మహత్య, అనాథలైన వారి పిల్లల కోసం కదిలివచ్చిన సంపూర్ణేష్ బాబు

సంపూర్ణేష్ బాబు మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. తల్లితండ్రులు కోల్పోయిన పిల్లలకు Rs.25000/- ఆర్థిక సహాయం అందించారు. అంతేకాకుండా ఎంత చదువుకుంటే అంతవరకు ఖర్చు నేనే చూసుకుంటానని అన్నాడు.
 
మెదక్ జిల్లా దుబ్బాకకు చెందిన నరసింహ చారి దంపతులు ఆర్ధిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో వారి ఇద్దరి ఆడ పిల్లలు అనాథలయ్యారు. వారిని ఆదుకునేందుకు వెంటనే రూ. 25 వేలు ఆర్ధిక సహాయం అందజేసారు సంపూర్ణేష్. వారి చదువుకు అయ్యే ఖర్చు మొత్తం తనే భరస్తానని అన్నారు.