బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 12 జూన్ 2021 (18:02 IST)

త్రుటిలో తప్పిన ప్రమాదం స్వల్ప గాయాలతో బయటపడ్డ దంపతులు

విశాఖపట్నం అనకాపల్లి స్థానిక బైపాస్ రోడ్ జలగలమధుం జంక్షన్ వద్ద ఆగి వున్న మోటార్ బైక్ వెనుక నుండి ఒక కారు ఒక లారీని తప్పించబోయి బైక్‌ను ఢీ కొనడంతో బండిపై ఉన్న దంపతులు ఒక అమ్మాయి బండి పైనుంచి రోడ్డు పక్కన పడిపోవడం జరిగింది.

ఈ ప్రమాదంలో మధు అక్షిత అమ్మాయికి స్వల్ప గాయాలు కాగా ప్రమాదంలో బైక్ స్వల్పంగా ధ్వంసమైంది. అలాగే బైక్ పైన ఉన్న దంపతులు కూడా చిన్నచిన్న గాయాలు అయ్యాయి. వీరు అనకాపల్లి నుండి మారేడు పూడి వెలుతున్నారు.

అనకాపల్లి నుండి వైజాగ్ వెళుతున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడ ట్రాఫిక్‌లో ఉన్న కానిస్టేబుల్ సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నరు.