సుకుమార్ బాగా స్పీడు పెంచాడుగా..!
దర్శకుడిగా భారీ చిత్రాలను తెరకెక్కిస్తోన్న బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ ఓ వైపు దర్శకుడిగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు నిర్మాతగాను చిత్రాలను నిర్మిస్తున్నాడు. తన నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లో తన దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ ఇతర ప్రముఖ నిర్మాణ సంస్థలతో కలిసి సినిమాలను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.
ఇటీవల సుకుమార్ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో కలిసి తన శిష్యుడుని దర్శకుడిగా పరిచయం చేస్తూ సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమాని ప్రారంభించారు.
తాజాగా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పైన సుకుమార్, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్మెంట్ శరత్ మరార్ కలయికలో ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నాగశౌర్య హీరోగా నటిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న కాశీ విశాల్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటిస్తారు. ఈ విధంగా సుకుమార్ కెరీర్లో స్పీడు పెంచాడన్నమాట.