మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 5 మార్చి 2018 (12:38 IST)

సన్నీలియోన్-వెబర్ దంపతులకు కవలలు (ఫోటో చూడండి)

సెర్చింజన్ గూగుల్‌లో నెటిజన్లు ప్రతి చిన్న విషయం కోసం వెతికేస్తున్నారు. అలాంటిది సెలెబ్రిటీల గురించి గూగుల్‌లో వెతికే వారి సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. గూగుల్ ద్వారా వికీపీడియా సెర్చ్‌లో బాలీవుడ్ కండల వ

సెర్చింజన్ గూగుల్‌లో నెటిజన్లు ప్రతి చిన్న విషయం కోసం వెతికేస్తున్నారు. అలాంటిది సెలెబ్రిటీల గురించి గూగుల్‌లో వెతికే వారి సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. గూగుల్ ద్వారా వికీపీడియా సెర్చ్‌లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ను.. శృంగార తార సన్నీలియోన్ వెనక్కి నెట్టింది. గూగుల్ సెర్చ్‌లో నెటిజన్లు సన్నీ కోసం ఎక్కువ వెతికారనే వికీపీడియా తెలిపింది.
 
గత పదేళ్ల కాలంలో నెటిజన్లు బాలీవుడ్, హాలీవుడ్‌లకు చెందిన ఏ సెలబ్రిటీ కోసం ఎక్కువగా శోధించారనే వివరాలను వికీపీడియా వెల్లడించింది. 2007 నుంచి 2017 మధ్య కాలంలో నెటిజన్లు శోధించిన 32 మంది బాలీవుడ్, హాలీవుడ్ సెలెబ్రిటీల జాబితాలో షారూఖ్ ఖాన్ రెండో స్థానంలో నిలవగా.. సల్మాన్ ఖాన్‌ (29)ను వెనక్కి నెట్టిన సన్నీలియోన్ 20వ స్థానంలో నిలిచింది.
 
ఇదిలా ఉంటే, సన్నీలియోన్, డానియర్ వెబర్ దంపతులు మళ్లీ తల్లిదండ్రులయ్యారు. సన్నీ దంపతులు ఇప్పటికే 21 నెలల అమ్మాయిని గత ఏడాది దత్తత తీసుకున్నారు. తద్వారా ఇప్పటికే తల్లిదండ్రులైన ఈ జంట.. తాజాగా ఇద్దరు కవల శిశువులను దత్తత తీసుకున్నారు. 
 
అషెర్ సింగ్ వెబర్, నోవా సింగ్ వెబర్ అనే ఇద్దరు కవల సోదరులను సన్నీ దంపతులు దత్తత తీసుకున్నారు. తన పెద్ద కుమార్తె నిషా కౌర్ వెబర్‌, తన ఇద్దరు కవలు, భర్తతో కలిసి తీసిన ఫోటోను సన్నీ లియోన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ ఫోటోను మీరూ ఓ లుక్కేయండి..