శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 నవంబరు 2023 (11:53 IST)

కంగువ షూటింగ్‌లో గాయపడిన సూర్య... రోప్ కెమెరా భుజంపై పడి..?

surya-kanguva
జై భీమ్ చిత్రంలో తన అద్భుతమైన నటనకు పేరుగాంచిన తమిళ నటుడు సూర్య తన రాబోయే చిత్రం కంగువ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సమయంలో సెట్స్‌లో ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది. కంగువ కోసం పోరాట సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా, రోప్ కెమెరా ప్రమాదవశాత్తు సూర్యపై పడింది.
 
సూర్య భుజానికి కెమెరా తగిలి గాయమైందని యూనిట్ తెలిపింది. తాను కోలుకోవాలని హృదయపూర్వక కోరుకుంటున్న అభిమానులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. మీ అందరి ప్రేమకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు.. అంటూ సూర్య పేర్కొన్నాడు. 
 
కెమెరా పడిపోవడం వల్ల స్వల్పంగా గాయపడిన తర్వాత, అతను విశ్రాంతి తీసుకోవడానికి, కోలుకోవడానికి సమయం ఇవ్వడానికి సినిమా షూటింగ్ తాత్కాలికంగా రద్దు చేయబడింది. ఈవీపీ ఫిల్మ్ సిటీలో గురువారం అర్ధరాత్రి 1.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.