శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 మార్చి 2022 (22:31 IST)

చీకటి మనుషులు.. శ్వేత బసు ప్రసాద్.. ఎవరిని చెప్పింది?

కొత్త బంగారు లోకం హీరోయిన్ శ్వేత బసు ప్రసాద్ ఓ వివాదాస్పద కేసులో పోలీసులకు చిక్కింది. ఎలాగోలా తప్పించుకుని బయటికి వచ్చింది కానీ, కెరీర్ మొత్తం నాశనమైపోయింది. తెలుగు తెరకు పూర్తిగా దూరమైపోయింది.  కానీ అంత జరిగినా ఓ తెలుగు హీరో తనకు ఛాన్సిస్తానంటూ ముందుకొచ్చాడట. ఈ విషయాన్ని శ్వేతబసు ప్రసాద్ తెలిపింది. కానీ ఆశపెట్టి మోసం చేశాడంటూ శ్వేత వాపోయింది. 
 
చేత కానప్పుడు, పబ్లిసిటీ కోసం సొల్లు కబుర్లెందుకు చెప్పాలంటూ ఆ హీరోకి గట్టిగానే క్లాస్ తీసుకుందని శ్వేత వెల్లడించింది. అతనిని "చీకటి మనుషులు" అని శ్వేతా ప్రస్తావించింది బహుశా ఆ హీరోని ఉద్దేశించే కావొచ్చు. ఇకపోతే, తెలుగులో శ్వేతాబసు ప్రసాద్‌కి ఛాన్సులు రాకపోయినా, బాలీవుడ్‌లో బాగానే సందడి చేస్తోంది.