మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (18:10 IST)

ఒత్తిడిలో శ్వేతబసు ప్రసాద్‌.. ఎందుకో తెలుసా? (video)

కొత్త బంగారు లోకం ఫేం శ్వేతాబసు ప్రసాద్ ఇటీవలే భర్తకు దూరమైంది. విడాకులు కూడా తీసుకుంది. అప్పట్లో ఓ కేసులో చిక్కుకుని వివాహం చేసుకున్న శ్వేతబసు ప్రసాద్‌కు ఆశించిన స్థాయిలో వ్యక్తిగత జీవితం కలిసిరాలేదు. ప్రస్తుతం సినీ ఆఫర్లతో కాస్త రిలాక్స్‌గా వున్న శ్వేతబసు ప్రసాద్‌కు లాక్ డౌన్ చెక్ పెట్టింది. తాజాగా శ్వేతాబసు ప్రసాద్ కూడా డిప్రెషన్‌లోకి వెళ్ళిందట. 
 
లాక్ డౌన్ కారణంగా వీడియో కాల్ ద్వారా థెరపిస్ట్‌తో మాట్లాడుతూ చికిత్స తీసుకుంటున్నట్టు చెబుతుంది. ఇది చాలా సహజమైన విషయం. మానసిక ఆరోగ్యానికి మన సమాజం ప్రాముఖ్యతను ఇవ్వాలని శ్వేత అభిప్రాయపడింది.
 
శ్వేతా బసు ప్రసాద్ గత ఏడాది తను ప్రేమించి పెళ్ళి చేసుకున్న భర్త రోహిత్ నుండి విడాకులు తీసుకుంది. అప్పుడే శ్వేత ఒక థెరపిస్ట్ దగ్గర ట్రీట్ మెంట్ తీసుకుందట. భర్త నుంచి విడిపోయిన తర్వాత శ్వేత తన తల్లిదండ్రుల దగ్గరకు పోకుండా సింగిల్ గానే ఉంటోందట. ప్రస్తుతం పలు హిందీ సీరియల్స్‌తో పాటు సినిమాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.