శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 15 ఆగస్టు 2018 (12:01 IST)

#SyeRaaNarasimhaReddy టీజర్ వచ్చేస్తోంది..

మెగా ఫ్యాన్స్‌కు ఓ శుభవార్త. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సైరా మూవీ ప్రొడ్యూసర్ రామ్ చరణ్... జాతీయ పతాకంతో ఒక పోస్టర్‌ను రిలీజ్ చేసారు. అంతేకాదు ఈ మూవీ టీజర్‌ను చిరంజీవి బర్త్‌డ

మెగా ఫ్యాన్స్‌కు ఓ శుభవార్త. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సైరా మూవీ ప్రొడ్యూసర్ రామ్ చరణ్... జాతీయ పతాకంతో ఒక పోస్టర్‌ను రిలీజ్ చేసారు. అంతేకాదు ఈ మూవీ టీజర్‌ను చిరంజీవి బర్త్‌డేకు ఒకరోజు ముందుగా ఆగస్టు21న ఉదయం 11.30 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్టు ఈ పోస్టర్‌లో తెలిపారు. సైరా మూవీని వచ్చే యేడాది సమ్మర్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. 
 
ఖైదీ నెం-150కి తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న మూవీ సైరా నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్ ఈ మూవీలో నరసింహారెడ్డి గురువు పాత్రలో నటిస్తున్నాడు. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో కనిపిస్తారు.