శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 13 మార్చి 2018 (14:58 IST)

'డార్లింగ్‌'తో పడకగది సన్నివేశాలు కూడా షేర్ చేసుకోవచ్చు : మిల్కీబ్యూటీ

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రం "బాహుబలి". ఈ చిత్రం తొలిభాగంలో ప్రభాస్ సరసన అవంతిక పాత్రలో తమన్నా కనిపిస్తోంది. ముఖ్యంగా "పచ్చబొట్టేసినా..." అనే పాటలో తమన్నా తన అందాలను ఆరబోస్తుంది. ప్

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రం "బాహుబలి". ఈ చిత్రం తొలిభాగంలో ప్రభాస్ సరసన అవంతిక పాత్రలో తమన్నా కనిపిస్తోంది. ముఖ్యంగా "పచ్చబొట్టేసినా..." అనే పాటలో తమన్నా తన అందాలను ఆరబోస్తుంది. ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ పాత్రలో ఉన్న "క్వీన్" చిత్రంలో నటిస్తోంది. 
 
ఈనేపథ్యంలో తన వ్యక్తిగత జీవితంపై స్పందిస్తూ, 'నాకు చిత్రపరిశ్రమలో స్నేహితులు చాలా త‌క్కువ‌. ప్ర‌భాస్, ర‌వితేజ వంటి కొంత‌మంది హీరోల‌తో స్నేహం ఉంది. ప్ర‌భాస్ చాలా న‌మ్మ‌క‌స్తుడు. అత‌నితో ఎలాంటి ర‌హ‌స్యాన్ని పంచుకున్నా ఫ‌ర్వాలేదు. ఇక‌, ర‌వితేజది చిన్నపిల్లాడి మ‌న‌స్త‌త్వం. ఎప్పుడూ ఎన‌ర్జిటిక్‌గా ఉంటారని చెప్పుకొచ్చింది. 
 
ఇకపోతే, త‌మిళ స్టార్ హీరో విక్ర‌మ్ చాలా పెర్ఫెక్ష‌నిస్టు. ప్ర‌తి చిన్న విష‌యంలోనూ జాగ్ర‌త్త‌లు తీసుకుంటారని తెలిపింది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్ అంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని, ఆయనతో నటించే అవకాశం వస్తే మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోబోనని చెప్పుకొచ్చింది.