మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: మంగళవారం, 12 డిశెంబరు 2017 (17:33 IST)

జగన్ మోహన్ రెడ్డితో ముద్రగడ కటిఫ్‌ - బాబుతో దోస్తీ...

కాపులను బిసిల్లో చేర్చాలని, వారికి రిజర్వేషన్లు ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన ముద్రగడ పద్మనాభం ఇప్పుడు ఎపి సిఎం చంద్రబాబునాయుడుకు దగ్గరైపోయారు. వై.ఎస్.జగన్మోహన్ రెడ్డితో సన్నిహితంగా ఉంటూ ఆ పార్టీలో చేరకున్నా జగన్ చెప్పే మాటలన్నింటిని వింటూ ఎ

కాపులను బిసిల్లో చేర్చాలని, వారికి రిజర్వేషన్లు ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన ముద్రగడ పద్మనాభం ఇప్పుడు ఎపి సిఎం చంద్రబాబునాయుడుకు దగ్గరైపోయారు. వై.ఎస్.జగన్మోహన్ రెడ్డితో సన్నిహితంగా ఉంటూ ఆ పార్టీలో చేరకున్నా జగన్ చెప్పే మాటలన్నింటిని వింటూ ఎపిలో ఒకానొక దశలో ముద్రగడ ఒక విధ్వంసకరమైన వాతావరణాన్ని సృష్టించారని టిడిపి నేతలే స్వయంగా చెప్పారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు జగన్‌తో స్నేహాన్ని కటిఫ్ చేసుకుని చంద్రబాబునాయుడుకు దగ్గరైపోయారు. 
 
అదెలాగంటే కాపులకు 5 శాతం రిజర్వేషన్లతో పాటు వారిని బిసిల్లో చేర్చడంపై కాపులందరూ తెలుగుదేశం పార్టీ వైపుకు వెళ్ళిపోయారు. దీంతో తను ఇప్పుడు జగన్ వెంట ఉంటే ఖచ్చితంగా కాపులందరూ తనను వ్యతిరేకించే అవకాశం ఉందని భావించిన ముద్రగడ ఏకంగా చంద్రబాబు నాయుడుతోనే దోస్తీకి సిద్థమైపోయాడు. కాపులను బిసిల్లో చేర్చిన చంద్రబాబుకే తమ మద్ధతంటూ ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా ఇదే విషయాన్ని చెబుతూ వస్తున్నారు. చంద్రబాబు కాపుల విషయంలో ముందడుగు వేశారంటూ మెల్లమెల్లగా ముందుకు వెళుతున్నారు.