శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 15 అక్టోబరు 2018 (09:19 IST)

లై డిటెక్టర్ టెస్ట్ చేస్తే వారి బండారం బయటపడుతుంది.. తనూశ్రీ దత్తా

బాలీవుడ్ నటుడు నానా పటేకర్ తనను లైంగికంగా వేధించారంటూ ఆరోపణలు చేసి సంచలనం సృష్టించిన బాలీవుడ్ సీనియర్ నటి తనూశ్రీ దత్తా మరో సూచన చేసింది. తాము ఎలాంటి తప్పు చేయలేదని చెబుతున్న నటులకు లై డిటెక్టర్ పరీక్షలు చేస్తే వారి బండారం బయటపడుతుందని వ్యాఖ్యానించారు.
 
ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమను మీటూ ఉద్యమం కుదిపేస్తున్న విషయం తెల్సిందే. బాలీవుడ్‌లో తనూశ్రీ దత్తా ముందు వరుసలో ఉండగా, కోలీవుడ్‌లో గాయని చిన్మయి శ్రీపాద ఉన్నారు. వీరిద్దరూ 'మీటూ' ఉద్యమంలో ముందు వరుసలో ఉన్నారని చెప్పొచ్చు. 
 
అయితే ఈ ఇద్దరూ ఆరోపించిన నానా పటేకర్, వైరముత్తులను ఒకే విధంగా ఇన్వెస్టిగేట్‌ చేయమని కోరుతున్నారు. 'వైరముత్తుగారూ.. మాట్లాడింది చాలు. ఆయన లై డిటెక్టర్‌ టెస్ట్‌ తీసుకోవాలి' అని ట్వీట్‌ చేశారు చిన్మయి. 
 
మరోవైపు తనుశ్రీ కూడా నానా పటేకర్‌కు లై డిటెక్టర్‌ టెస్ట్, నార్కో అనాలసిస్‌ పరీక్షలు చేయించాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కోరారట. ఇందులో నృత్య దర్శకుడు గణేశ్‌ ఆచార్య, నిర్మాత రాకేశ్‌ సారంగ పేర్లు కూడా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. మొత్తంమీద తనూశ్రీ దత్తా, చిన్మయి చేసిన డిమాండ్‌పై పోలీసులు లేదా కోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.