శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 19 ఏప్రియల్ 2021 (13:52 IST)

తెలంగాణ వెనుకబడింది. మీరెలా అభివృద్ధి చేస్తారని ప్ర‌శ్నించిన ‌వారే నేడు..ః మొహమ్మద్ అలీ

Telangana devedu movie function
శ్రీకాంత్ టైటిల్‌ పాత్రలో ‘తెలంగాణ దేవుడు’ రూపొందింది. జిషాన్ ఉస్మాన్ హీరోగా ప‌రిచ‌య‌మ‌వు తున్నాడు. ‌బ్రహ్మానందం, సునీల్, సుమన్, తనికెళ్ళ భరణి, బ్రహ్మాజీ, మధుమితతో పాటు 50 మంది అగ్ర తారాగణం ఈ చిత్రంలో నటించారు. వడత్య హరీష్ దర్శకత్వంలో మ్యాక్స్‌ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ హోం శాఖా మంత్రి వర్యులు మొహమ్మద్ అలీ, మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్.. చిత్ర ట్రైలర్స్‌ను విడుదల చేశారు. చిత్ర నిర్మాత మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ ఈ చిత్రంలోని మొదటి పాట ‘వాడెవడు వీడెవడు’ సాంగ్‌ను విడుదల చేశారు. అప్పాజి రెండవ పాటను విడుదల చేశారు. ‘జై తెలంగాణ’ అంటూ సాగే మూడవ పాటను ప్రభాకర్ విడుదల చేశారు. ‘తెలంగాణ అమరులకు వందనం’ అంటూ సాగే నాలుగవ పాటను ప్రముఖ నిర్మాత, నటుడు, దర్శకుడు ఆర్. నారాయణమూర్తి విడుదల చేశారు.
 
అనంతరం తెలంగాణ హోం మినిస్టర్ మొహమ్మద్ అలీ మాట్లాడుతూ, తెలంగాణ రాకముందు కేసీఆర్‌గారు పార్లమెంట్‌లో రిప్రజెంట్ చేసి ఎంపీలను, 36 పార్టీల ప్రెసిడెంట్‌లను కలిసి రిక్వెస్ట్ చేస్తే అందరూ కూడా తెలంగాణ చాలా వెనుకబడింది. మీ దగ్గర పవర్ లేదు, ఫార్మర్స్ సూసైడ్ చేసుకొంటున్నారు, ల్యాండ్ ఆర్డర్ బాగాలేదు మీరెలా అభివృద్ధి చేస్తారని అందరూ క్వశ్చన్ చేశారు. తెలంగాణ సాధించిన తర్వాత ఈ రోజు అన్ని రంగాలను ప్రగతి పథంలో తీసుకెళుతూ కేసీఆర్‌గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. 2002 చంద్రబాబు పాలనలో రైతులు రెండు గంటల కరెంట్ ఎక్కువ కావాలని దీక్ష చేస్తూ.. ప్రభుత్వాన్నీ నిలదీస్తే ఫైరింగ్ చేసి పది మంది రైతుల మరణానికి కారణమైనాడు. అలాంటిది ప్రస్తుతం రైతులకు రైతు భీమా ఏర్పాటు చేసి వారికి కేసీఆర్‌గారు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నారు. అలాగే పవర్‌ విషయంలో తెలంగాణ నెంబర్ వన్‌లో ఉంది. ఫ్లోరైడ్ నీరు ఎక్కువ ఉండే నల్గొండలో ఇంటింటికి మంచి నీరిచ్చారు. ఇలా అందరికీ మంచి చేసుకుంటూ కేసీఆర్‌ను వంకపెట్టే ఛాన్స్ ఇవ్వకుండా తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ స్టేట్‌గా తీసుకువచ్చారు. ఎంతో కష్టపడి తెలంగాణను తీసుకొచ్చిన కేసీఆర్ బయోపిక్‌కు ‘తెలంగాణ దేవుడు’ టైటిలే కరెక్ట్‌గా సూట్ అయ్యింది. తెలంగాణ ఉద్యమం గురించి తెలియజేసే సినిమా ఫంక్షన్‌కు మమ్మల్ని ఆహ్వానించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. వారికి ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను..’’ అని అన్నారు.
 
సినిమా ప‌రిశ్ర‌మ‌లోనూ మార్పును తీసుకు వస్తాం
మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, దేశంలో లేని ఎన్నో పతకాలు కేసీఆర్ గారు ప్రవేశ పెట్టారు. కాబట్టి ప్రజలకు ఉపయోగపడే మంచి పథకాలు పెట్టిన కేసీఆర్ నిజంగా ‘తెలంగాణ దేవుడే’. అలాగే ఆనాడు సినిమా తీయాలి అంటే సినిమా ఇండస్ట్రీ కొంతమంది చేతుల్లోనే ఉండేది వాళ్లు తీస్తేనే థియేటర్స్ ఓపెన్ అయ్యి సినిమాలు ఆడాలి అనే పరిస్థితి ఉండేది అది ఇప్పుడు మారుతూ వస్తుంది. దానిలో కూడా ఇంకా మార్పును తీసుకు వస్తాం. తెలంగాణ రాక ముందు వచ్చిన తరువాత అభివృద్ధి గురించి తెలియజేస్తూ ప్రజలకు తెలంగాణ గురించి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. వాటి మీద కూడా సినిమాలు తీయాలి. ఇలాంటి మంచి సినిమాలు ఎవరు తీసినా ప్రభుత్వం అన్ని రకాలూగా సపోర్ట్ గా నిలుస్తూ వారికి కావలసిన సహాయ,సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాము. నా మిత్రుడు హీరో శ్రీకాంత్ మా నాయకుడు కేసీఆర్ పాత్రలో అద్భుతంగా నటించాడు. వారికి మరియు దర్శకనిర్మాతలకు ఈ సినిమా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేక్షకులందరికీ ఈ సినిమా తప్పక నచ్చుతుంది’’ అన్నారు.
 
ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ, దాసరిగారి శిష్యుల దగ్గర శిష్యరికం చేసిన హరీష్ కూడా వారిలాగే ఈ సినిమాతో పెద్ద దర్శకుడవ్వాలి. కేసీఆర్ బయోపిక్ పాత్రలో శ్రీకాంత్ అద్బుతంగా నటించాడు. ఈ చిత్రానికి ఎంతో మంది పెద్ద టెక్నిషియన్స్ వర్క్ చేశారు. ప్రస్తుతం కేసీఆర్ తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి వారు చేసిన కృషిని దృష్టిలో ఉంచుకొని దర్శకుడు హరీష్ ‘తెలంగాణ దేవుడు’ టైటిల్ పెట్టడం చాలా శుభపరిణామం అని అన్నారు.
 
నిర్మాత మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ మాట్లాడుతూ, తెలంగాణ కోసం కష్టపడి ప్రత్యేక తెలంగాణను సాధించిన కె.సి.ఆర్ గారి బయోపిక్‌ను తీసినందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.
 
దర్శకుడు వడత్యా హరీష్ మాట్లాడుతూ, ఇలాంటి గొప్ప చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ చిత్రాన్ని నిర్మించడానికి ధైర్యం ఇచ్చిన నిర్మాత మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ గారికి నా కృతజ్ఞతలు. ఈ చిత్రం ఇంత బాగా రావడానికి సహకరించిన నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులకు నా ధన్యవాదాలు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 23న విడుదలకానుంది. ఈ చిత్రం అందరికీ తప్పక నచ్చుతుంది అన్నారు.
 
సంగీత దర్శకుడు నందన్ బొబ్బిలి మాట్లాడుతూ, ఇంత గొప్ప సినిమాకు మ్యూజిక్ ఇచ్చే అవకాశం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సాంగ్స్ ఇంత బాగా రావడానికి టీం అందరి సహకారం ఎంతో ఉంది. శ్రీకాంత్‌గారు, దర్శకనిర్మాతలు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. నాకీ అవకాశం కల్పించిన దర్శకనిర్మాతలకు నా ధన్యవాదాలు’’ అని అన్నారు.
 
కేసీఆర్‌గారి పాత్ర అనగానే షాకయ్యా:శ్రీకాంత్‌
ద‌ర్శకుడు హరీష్ నన్ను కలిసి కేసీఆర్‌గారి బయోపిక్ సినిమా చేస్తున్నానని చెప్పి, ఆయన పాత్రలో నువ్వు నటించాలని చెప్పినపుడు షాక్ అయ్యాను. నేను ఆయన పాత్రలో నటించగలనా? లేదా? ఆయన పాత్రకు నేను సూట్ అవుతానా? అనే ఆలోచనతో కొంత టైమ్ తీసుకొని ఎలా చేస్తే బాగుంటుందా అని డిస్కషన్ చేసి ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. దేశాన్ని సాధించిన మహాత్మాగాంధీని జాతిపిత అంటారు. తెలంగాణను సాధించిన కేసీఆర్‌గారు కూడా ఒకరకంగా తెలంగాణ దేవుడే. అలాంటి కేసీఆర్ రోల్ నాకు లభించినందుకు ఈ రోజు నేను నిజంగా గర్వపడుతున్నాను. ఆ రోజు ఈ సినిమా చేయడానికి ఒప్పుకోకుంటే ఇలాంటి మంచి సినిమాలో నటించే ఛాన్స్ మిస్ చేసుకునే వాడిని. ఈ సినిమా కరోనా కంటే ముందు స్టార్ట్ అయ్యింది. కానీ వారందరి డేట్స్ సెట్ అవ్వక సినిమా ఆలస్యం అయ్యింది. ఇంత మంచి సబ్జెక్ట్‌ను, ఎంతో మంది ఆర్టిస్టులతో మంచి ప్రొడక్షన్ వేల్యూస్‌తో నిర్మాత జాకీర్ ఉస్మాన్ గారు ఎంతో ప్యాసినెట్‌గా ఖర్చుకు వెనుకాడకుండా చిత్రాన్ని అద్బుతంగా తెరకెక్కించారు. 23న విడుదల అవుతున్న ఈ సినిమా చూడడానికి వచ్చే ప్రతి ప్రేక్షకుడు కోవిడ్ ప్రికాషన్స్ తీసుకొని సినిమాను విజయవంతం చేయాలని కోరుతున్నాను` అని అన్నారు.