సినీ కార్మిక ఫెడరేషన్ కార్యాలయంలో ఉద్రిక్తత - చర్యలు ప్రారంభం
సినిమా రంగంలోని 24 శాఖలు (క్రాఫ్ట్)కు చెందిన కార్మికులు తమకు వేతనాల్లో పెరుగుదల లేదని, కనీస సౌకర్యాలు కల్పించాలని గత కొన్ని ఏళ్ళుగా డిమాండ్ చేస్తున్నారు. కరోనా టైంలో రెండేళ్ళపాటు వారికి సరైన పనిలేదు. ఆ తర్వాత షూటింగ్‌లు పుంచుకున్నా.. వేతనాల్లో ఎటువంటి మార్పులేదని వాపోతున్నారు. అందుకే కార్మిక సమాఖ్య (టిఎఫ్.ఐ) భవనాన్ని ముట్టడించేందుకు ఈరోజు బుధవారం ఉదయం కార్యాలయానికి కొంతమంది కార్మికులు వెళ్ళారు. ఈ విషయాన్ని పసిగట్టిన కార్మిక నాయకులు, సినీ పెద్దలు వెంకటగిరిలోని కార్యాలయంలో అత్యవసర సమావేశం అయ్యారు.
అయితే ఇప్పటికే సమస్యల గురించి ఛాంబర్‌కు, సినీ పెద్దలకు లెటర్ ద్వారా తెలియజేశామని కార్మిక సంఘాల నాయకులు తెలియజేస్తున్నారు. కానీ మాకు ఎటువంటి లెటర్ రాలేదని నూతనంగా ఎన్నికైన ఫిలింఛాంబర్ అధ్యక్షుడు కొల్లి రామకృష్ణ తెలియజేస్తున్నారు.
- ఈ విషయమై కార్మికల నాయకులు మాట్లాడుతూ, రామకృష్ణ చెప్పేవన్నీ అబద్దాలంటూ తాము లిఖిత పూర్వకంగా ఇచ్చిన విషయాన్ని అక్కడ మీడియాకు తెలియజేశారు.
అసలు కార్మికుల సమస్యలేమిటి!
- కార్మికుల కనీస వేతం 750 నుంచి 1500వరకు పెంచారు. ఇది ప్రతి నాలుగేళ్ళకు మారాల్సివుంటుంది. కానీ 15 ఏళ్ళనాడు వున్న వేతనాలే ఇవ్వడం, అదనపు డ్యూటీ (షూటింగ్) చేసినా తమకు బత్తాలు ఇవ్వడంలేదని కార్మికుల వాదన. ఎక్కడైనా కార్మికులకు 8 గంటలే పని. కానీ సినీ కార్మికులకు 12 గంటలపని చేయాలి.
- మహిళా కార్మికులకు, పురుష కార్మికులకు వేతనాల్లో చాలా వ్యత్యాసం వుంది. తమకూ సమాన వేతనం ఇవ్వాలని మహిలలు డిమాండ్.
- 24 శాఖలోని రిజిష్టర్ కార్మికులే షూటింగ్‌లలో పనిచేయాలి. కానీ సభ్యత్వం లేని వారిని మేనేజర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు తీసుకురావడంపై తీవ్ర నిరసన.
- ఈ విషయాలపై ఈరోజు సాయంత్రానికి నాయకుల చర్చల ఫలితాలు కన్పిస్తాయని కొందరు నాయకులు తెలియజేశారు.