శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 21 జూన్ 2022 (19:58 IST)

రాత్రిపూట తల్లితో గొడవపడి బైటకొచ్చిన బాలిక, కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్

కామాంధులు కఠిన శిక్షలు పడతాయని తెలిసి కూడా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇటీవలే జూబ్లిహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటన జరిగింది. ఈ అఘాయిత్యానికి పాల్పడిన నిందితులపై కఠిన శిక్షలు నమోదుచేయబడ్డాయి. ఇలాంటి కఠిన శిక్షలను లెక్కచేయడంలేదు కామాంధులు. జూన్ 17వ తేదీ రాత్రి మరో బాలికపై నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 
పూర్తి వివరాలను చూస్తే.. ఓల్డ్ సిటీ లోని చాంద్రాయణగుట్టకు చెందిన 14 ఏళ్ల బాలిక 17వ తేదీ రాత్రిపూట తన తల్లితో గొడవపడి 2 కిలోమీటర్ల దూరంలో వున్న తన అమ్మమ్మ దగ్గరకి వెళ్లింది. మనవరాలికి సర్దిచెప్పి తల్లివద్దకు వెళ్లాలని అమ్మమ్మ బుజ్జగించడంతో తిరుగు ప్రయాణమైంది. ఆమె వెళ్తున్న సమయంలో ఆటోలో నలుగురు వ్యక్తులు ఆమెపై కన్నేసారు.

 
ఆ బాలికకు మాయమాటలు చెప్పి ఆటోలో ఎక్కించుకుని బండ్లగూడ నుంచి పలు ప్రదేశాల్లో తిప్పుతూ ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తెల్లవారిన తర్వాత బాలికను రోడ్డుపై విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఇంటికి చేరిన బాలిక తనపై జరిగిన అఘాయిత్యాన్ని కుటుంబ సభ్యులతో చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు. బాలికపై దారుణానికి ఒడిగట్టిన నిందితులను పోలీసులు అరెస్టు చేసి వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసారు.