మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: బుధవారం, 14 అక్టోబరు 2020 (22:29 IST)

ఆ ప్రచారం బాధిస్తోందంటున్న శాంతి స్వరూప్

ఒక స్కిట్‌కు 4 నుంచి 5 లక్షలు ఇస్తారు. కామెడీ యాక్టర్లు కాదు కుబేరులే. బాగా సంపాదించేశారు. జబర్దస్త్ టీంలో ఉన్న వారందరూ కోట్లకు పడుగలెత్తారు. ఇక వారికి ఎలాంటి ఇబ్బందులు లేవు. టీకి టికానా కొట్టే వాళ్ళు ఇప్పుడు కోట్లకు కోట్లు సంపాదించేశారు. ఇది కొంతమంది యూట్యూబ్‌లో మా గురించి ప్రచారం చేస్తున్నారంటూ ఆవేదనకు గురయ్యాడు శాంతి స్వరూప్.
 
శాంతి స్వరూప్ అంటే ఠక్కున గుర్తుస్తొందిగా ఆడ వేషంలో జబర్ధస్త్‌లో అదరగొడుతుంటాడు. ఆడవేషంలో శాంతి స్వరూప్ పైన పడే పంచ్‌లు బాగా హిట్ అవుతుంటాయి. లక్షలాదిమంది అభిమానులకు బాగా దగ్గరయ్యాడు శాంతిస్వరూప్.
 
అయితే ఈ మధ్య తన గురించి కూడా యుట్యూబ్‌లో వస్తున్న గాసిప్స్ బాగా బాధపెట్టిందట శాంతిస్వరూప్‌కు. మేము విదేశాల్లో కూడా వెళ్ళి స్టేజ్ షోలు ఇస్తున్న మాట వాస్తవమే. కాదనలేదు. కానీ మాకు వచ్చే రెమ్యునరేషన్ చాలా తక్కువ. 
 
ఒక్క స్కిట్‌కే 5 లక్షల దాకా నిర్వాహకులు ముట్టజెబుతారని ప్రచారం చేస్తున్నారు. నాకు కూడా 2 లక్షలు ఇస్తున్నారని చెబుతున్నారు. ఇలాంటి ప్రచారం దయచేసి చేయవద్దండి. మాకు స్కిట్‌కు ఇచ్చేది 5 నుంచి 10 వేల రూపాయలు మాత్రమే. కొంతమంది అయితే 2,500 రూపాయలు మాత్రమే ఇస్తారు.
 
దీంతో ఎలా అయిపోతాం కోటీశ్వరులం. ఇలాంటి ప్రచారం మానుకోండి. ఆ విషయం చాలా బాధిస్తోంది నన్ను. పైకి నవ్విస్తాం.. కానీ ఒక్కో సమయంలో మాలోపలంతా ఏడుపులే అంటున్నాడు శాంతిస్వరూప్.