శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 7 సెప్టెంబరు 2024 (17:05 IST)

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

Nani
నేచురల్ స్టార్‌గా పేరుపొందిన తెలుగు నటుడు నాని ఇటీవల ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్ లో కనిపించారు. ఈ ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో నాని అనే తన ముద్దుపేరు గురించి, మరచిపోలేని ఫ్యాన్ ఇంటరాక్షన్ గురించి, భవిష్యత్తులో తను కలిసి పనిచేయాలని కలలు కనే నటులు, దర్శకుల గురించి ఇలా మరెన్నో విషయాల గురించి ఓపెన్ అయ్యారు. నేచురల్ స్టార్ అనే ట్యాగ్ రావడం గురించి అడిగినప్పుడు, “ఇది కేవలం ఒక ప్రత్యేకమైన పాత్ర కాదు, ఒక ప్రక్రియ. మొదట్లో నేను ఎంచుకున్న సినిమాలు, నేను అనుసరించిన నటనా శైలి వల్ల నన్నందరు ‘సహజ నటుడు’ అంటే నేచురల్ యాక్టర్ అని పిలవడం మొదలుపెట్టారు. జెండా పై కపిరాజు దర్శకుడు మొదట 'నేచురల్ స్టార్ నాని' అనే టైటిల్ కట్ పెట్టాడని, ఆ తర్వాత భలే భలే మగాడివోయ్ అనే బ్లాక్ బస్టర్ కామెడీకి కూడా ‘నేచురల్ స్టార్’ అనే టైటిల్ కూడా పెట్టాలనుకుంటున్నానని దర్శకుడు చెప్పాడు. మొదట్లో అతను జోక్ చేస్తున్నాడని అనుకున్నాను. కానీ, కొంత పట్టుబట్టి డైరెక్టర్ ఆ టైటిల్ ఉపయోగించాడు. ఇంకా అ సినిమా విజయం తర్వాత ప్రేక్షకులు ఆ ట్యాగ్ ను ఆదరించారు. మొదట్లో కొంత ఇబ్బందిగా అనిపించినా అభిమానుల ప్రేమ, సపోర్ట్ నన్ను ఆ ట్యాగ్‌ని ఇష్టపడేలా చేసింది”

దీనితో పాటు తనపై చెరగని ముద్ర వేసిన ఒక అభిమానితో జరిగిన సంభాషణను కూడా నాని గుర్తుచేసుకున్నారు. “ఇటీవల జరిగిన ఓ సంఘటనను ఎప్పటికీ మర్చిపోలేను. భర్తను కోల్పోయిన ఓ మహిళ తన భర్తతో కలిసి నా సినిమాలు చూడటమే తమ ఫేవరెట్ అని చెప్పింది. చాలా సార్లు నా సినిమాలు చూస్తూ వారు మంచి సమయం గడిపేవారట! ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆమె నా సినిమాలు చూస్తూనే ఉంది. ఆయనను తన పక్కన ఊహించుకుంటూ, ఒకప్పుడు వారు పంచుకున్న క్షణాలను ఇంకా ఆస్వాదిస్తూ ఉంటుందట. నా నటన ఇంత లోతైన రీతిలో వారికి ఓదార్పునిస్తుందని తెలుసుకోవడం కొంత అసహజంగా అనిపించింది”

అలాగే ఇండియన్ సినిమాలోని ప్రముఖ దర్శకులతో కలిసి పనిచేయాలని ఉందనే తన నాని ఆకాంక్షను వ్యక్తం చేశాడు. రాజ్ కుమార్ హిరానీ సార్, జోయా అక్తర్, ఇంతియాజ్ అలీ లతో కలిసి పనిచేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నానని, తెలుగు సినిమాల్లో చాలా మంది దర్శకులతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నానని చెప్పారు.