సోమవారం, 24 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 24 ఆగస్టు 2024 (21:00 IST)

జనక అయితే గనక' యుఎస్‌ఏ రైట్స్ తీసుకున్న హీరో సుహాస్‌

Janaka ayithe Ganaka
Janaka ayithe Ganaka
దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోన్న  సినిమా 'జనక అయితే గనక'. శిరీష్‌ సమర్పణలో హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు.  వెర్సటైల్‌ యాక్టర్‌ సుహాస్‌ హీరోగా నటించారు. సందీప్‌ రెడ్డి బండ్ల డైరక్ట్ చేశారు. సెప్టెంబర్‌ 7న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. సంగీర్తన హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా ఫైనల్‌ వెర్షన్‌ని చూసిన సుహాస్‌, యుఎస్‌ఏ హక్కులను సొంతం చేసుకున్నారు.  
 
సుహాస్‌ మాట్లాడుతూ ''ఫైనల్‌ వెర్షన్‌ చూశాను. చాలా బాగా నచ్చింది. వెంటనే యుఎస్‌ఏ హక్కులను తీసుకున్నాను. పక్కా ఎంటర్‌టైనింగ్‌ సినిమా అవుతుంది. ప్రతి దానికీ లెక్కలు చెప్పే మిడిల్‌ క్లాస్‌ అబ్బాయిగా ఈ సినిమాలో కనిపిస్తాను. తప్పకుండా ప్రేక్షకులు పడీ పడీ నవ్వుకుంటారు. మా డైరక్టర్‌ చాలా మంచి సినిమా చేశారు. దిల్‌రాజు గారు సపోర్ట్ చేసిన తీరు మర్చిపోలేం'' అని అన్నారు.  
 
నటీనటులు: సుహాస్‌, సంగీర్తన, రాజేంద్రప్రసాద్‌, గోపరాజు రమణ తదితరులు