గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 5 సెప్టెంబరు 2022 (15:50 IST)

అల్లరి నరేష్ ఉగ్రం షూటింగ్ మొద‌లైంది

Naresh ph
Naresh ph
హీరో అల్లరి నరేష్, దర్శకుడు విజయ్ కనకమేడల సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో వసున్న రెండో చిత్రం మరింత విభిన్న కథ, కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఫస్ట్ లుక్,  టైటిల్ సూచించినట్లుగా అల్లరి నరేష్ ఉగ్రంలో ఫెరోషియస్ పాత్రలో కనిపించనున్నారు.
 
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు నుండి ప్రారంభమైయిందని ఒక గింప్స్ వీడియోతో ప్రకటించారు. ముఖానికి నల్లటి మాస్క్ లా రంగు, అల్లరి నరేష్‌ క్లోజ్‌అప్‌ లో కళ్ళని అటు ఇటు తిప్పి దేనికోసమో వెతకడం, ఒక చోట చూపు నిలపడం, కళ్ళు ఎర్రగా మారడం.. ఇలా చాలా టెర్రిఫిక్ గా వుంది గింప్స్ వీడియో. వీడియో లో వినిపించిన నేపధ్యం సంగీతం కూడా ఎమోషన్ ని మరింత ఎలివేట్ చేసింది. టైటిల్ కి తగ్గట్టుగా ఈ గ్లింప్స్ వీడియో అల్లరి నరేష్ పాత్ర ఉగ్రరూపాన్ని తెలియజేస్తుంది.
 
కృష్ణార్జున యుద్ధం, మజిలీ, గాలి సంపత్, టక్ జగదీష్ వంటి పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులను నిర్మించిన నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం 5గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
ఈ సినిమాలో మిర్నా కథానాయికగా నటిస్తుంది. కొంతమంది ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలను పోషించనున్నారు. నాంది చిత్రానికి పనిచేసిన టెక్నికల్ టీం దాదాపుగా ఉగ్రంలో భాగమయ్యారు.
 
తూము వెంకట్ కథను అందించగా, అబ్బూరి రవి మాటలు రాస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా, సిద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్.
 
 
ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు వివరాలు త్వరలోనే తెలియజేస్తారు.
 
తారాగణం: అల్లరి నరేష్, మిర్నా మీనన్
సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం: విజయ్ కనకమేడల
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
బ్యానర్: షైన్ స్క్రీన్స్
కథ: తూము వెంకట్
డైలాగ్స్: అబ్బూరి రవి
డీవోపీ: సిద్
సంగీతం: శ్రీచరణ్ పాకాల
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి
పీఆర్వో:  వంశీ-శేఖర్