గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 మార్చి 2023 (22:29 IST)

ఎలాంటి కమర్షియల్ హంగుల్లేవ్.. టీఆర్పీని అదరగొట్టిన ఆర్ఆర్ఆర్

rrrforoscars
ఆర్ఆర్ఆర్‌ సినిమాతో, మాస్టర్ స్టోరీటెల్లర్ రాజమౌళి తెలుగు సినిమాని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిపారు. ఎంఎం కీరవాణి స్వరపరచిన నాటు నాటు పాట ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును గెలుచుకుని ప్రతి భారతీయుడు గర్వించేలా చేసింది. తారక్, చరణ్‌ల స్టార్‌డమ్ ఇప్పుడు ఇతర ఖండాలకు విస్తరించింది.
 
ఆస్కార్ అవార్డ్ వేడుకకు ముందు ఈ సినిమా ఇటీవల స్టార్ మాలో ప్రసారమైంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా ఈ సినిమా ప్రసారమైంది. తాజాగా ఈ టెలికాస్ట్‌లో ఆర్ఆర్ఆర్‌ 8.17 టీఆర్పీని నమోదు చేసింది.
 
డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో అజయ్ దేవగన్, అలియా భట్, రాహుల్ రామకృష్ణ, శ్రియా శరణ్, అలిసన్ డూడీ, రే స్టీవెన్సన్, సముద్రఖని, ఒలివియా మోరిస్ కీలక పాత్రలు పోషించారు.