బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 14 మే 2022 (10:35 IST)

తమిళనాడు సీఎం తనయుడి సంచలన నిర్ణయం.. ఏంటది?

nayanatara udhayanidhi stalin
తమిళనాడు సీఎం తనయుడు, ఎమ్మెల్యే, నటుడు, ఉదయనిధి స్టాలిన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై సినిమాల నుంచి తప్పుకోనున్నట్టు ప్రకటించారు.

రాజకీయాల్లో వున్నానని.. ప్రజలకు సేవ చేసేందుకు సమయం అధికంగా వెచ్చించనున్నట్లు తెలిపారు. అందుకే సినిమాలకు దూరం అవుతున్నట్లు ప్రకటన చేసారు. 
 
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను నటిస్తున్న మామన్నన్‌ చిత్రమే తన చివరిదని తెలిపాడు. 
 
మారి సెల్వరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఫాహద్‌ ఫజల్‌, కీర్తి సురేష్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎ ఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు.