సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 25 నవంబరు 2023 (12:04 IST)

ఉక్కు సత్యాగ్రహంలో పాటలు రాయడంతోపాటు నటించారు : గద్దర్ కుమార్తె వెన్నెల

Vennela, Singer Jhansi, MLA Dharmashree, sathyareddy
Vennela, Singer Jhansi, MLA Dharmashree, sathyareddy
సత్యా రెడ్డి నిర్మాతగా, దర్శకత్వం చేస్తూ నటించిన సినిమా ఉక్కు సత్యాగ్రహం. ఈ సినిమా ట్రైలర్ మరియు సాంగ్స్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు త్రినాధ రావు నక్కిన గారు, ఎమ్మెల్యే ధర్మశ్రీ గారు, గద్దర్ వెన్నెల, ఫిలిం ఛాంబర్ మాజీ చైర్మన్ బివి రెడ్డి, పారిశ్రామికవేత్త రాజీవ్,  ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ పాల్గొన్నారు.
 
గద్దర్ కుమార్తె వెన్నెల మాట్లాడుతూ : మా నాన్నగారైన గద్దర్ గారు ప్రజల కోసం ఎంతో పాటు పడేవారు. ఆయన రాసిన పాటలు గాని గేయాలు గాని అన్ని ప్రజల కోసము ప్రజల సమస్యల మీదనే ఉండేవి. కరోనా సమయంలో కూడా ఆంధ్ర తెలంగాణ ఇరు రాష్ట్రాల్లోనే అన్ని ప్రాంతాలు తిరిగి ప్రజల కోసం ఎంతో సేవ చేశారు అలాగే వారి సమస్యలను ఉద్దేశిస్తూ ఎన్నో పాటలను కూడా ఆయన రాశారు పాడారు. అలాగే ప్రజా సమస్యల పైన పోరాడే చిత్రాలను ఎక్కువగా నటించిన నాన్నగారు ఈ సినిమాలో పాటలు రాయడంతోపాటు నటించారు.
 
బస్ కండక్టర్, గాయని ఝాన్సీ మాట్లాడుతూ,  సోషల్ మీడియా ద్వారా మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది. అలాగే సినిమాలు కూడా మంచిగానే చెడును గాని తెలిపేందుకు మరగ దర్శకాలుగా ఉన్నాయి. ఈ సినిమాలో నేను నటించడానికి కారణం జన సమస్యలను పరిష్కరించే ఒక మంచి చిత్రం ఇది మంచి అంశాలతో కూడుకున్న కథ అందువల్లనే చిత్రంలో నటించాలని అనుకున్నాను. అలాగే నాకు ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన సత్యారెడ్డికి ధన్యవాదాలు అని అన్నారు.
 
దర్శకుడు సత్యా రెడ్డి గారు మాట్లాడుతూ : ఈ సినిమా నేను చేయడానికి గల ముఖ్య కారణం గద్దర్ గారు ఆయనతో నాకున్న అనుబంధం మర్చిపోలేనిది. గద్దర్ గారు నాకు తండ్రితో సమానం ఆయన వయసుతో సంబంధం లేకుండా అందరితోనూ కలివిడిగా కలిసిపోయి ఉండేవారు. ఆయన ఈ రోజున మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం కాకపోతే ఆయన కూతురు అయిన వెన్నెల గారిని ఆయన రూపంలో మాకు బహుమతిగా అందించారు. గద్దర్ గారితో ఉన్న జ్ఞాపకాలని పంచుకున్నారు. అదేవిధంగా ఈ సినిమా విశాఖ ఉక్కు ఉద్యమానికి సంబంధించిన సమస్యల్ని తెలియజేస్తూ తీశాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిధులు త్రినాధరావు నక్కిన గారికి మరియు ఎమ్మెల్యే ధర్మ శ్రీ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇంకా దర్శకుడు త్రినాధరావు నక్కిన, విశాఖపట్నం (చోడవరం) ఎమ్మెల్యే ధర్మశ్రీ మాట్లాడారు.