గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 23 మార్చి 2021 (09:52 IST)

పింక్‌ను పూర్తిగా మార్పులుచేసిన వ‌కీల్‌సాబ్‌

Pavan dubbing
ప‌వ‌న్‌క‌ళ్యాణ్ త‌న చిత్రం వ‌కీల్‌సాబ్‌కు సంబంధించిన డ‌బ్బింగ్‌ను ఆరంభించాడు. ఇందుకు సంబంధించిన ఆయ‌న సీన్స్‌ను నిన్న ప్ర‌సాద్ ల్యాబ్‌లో తిల‌కించారు. సినిమా మొత్తంగా మూడు స‌న్నివేశాలు మిన‌హా ఆయ‌న క‌నిపిస్తార‌ని తెలుస్తోంది. అందులో ముఖ్యంగా మ‌హిళల‌కు గౌర‌వించే విధంగా సినిమా వుంటుంద‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. బాలీవుడ్ సినిమా పింక్‌ సినిమాను దాదాపు మూడొంతుల మార్చేసి వ‌కీల్ సాబ్ తీశారు. ఈ విష‌యాన్ని ఇటీవ‌లే సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ వెల్ల‌డించారు.

dubbing team
2016లో విడుద‌లైన ఈ సినిమాలో అమితాబ్‌బ‌చ్చ‌న్‌, తాప్సీ, అంగ‌ద్‌బేడీ వంటివారు న‌టించారు. కానీ, తెలుగు వ‌చ్చేస‌రికి వారికంటే ఇమేజ్ వున్న న‌టుడు ప‌వ‌న్ కాబ‌ట్టి ఆయ‌న‌కు అనుగుఫంగా కొంత మార్పు చేశారు. ముఖ్యంగా మ‌గున నీ విలువ తెలుసా! అంటూ ఏకంగా పాట‌నే రాసేశారు.

అందులో న‌లుగురు న‌టీమ‌ణులు క‌న్పించ‌నున్నారు. ఇందులో పాట‌ల‌కు ప్ర‌త్యేక ప్రాధాన్య‌త వుంది. ఈ సినిమా విడుద‌ల త‌ర్వాత అంద‌రూ గొప్ప‌గా చెప్పుకుంటార‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేస్తుంది.