ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 26 జులై 2020 (09:31 IST)

వనితా.. ఇతను నాలుగో భర్తనా? వనితను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

vanitha vijayakumar
తమిళ నటి, విజయ్ కుమార్ కూతురు వనిత మూడో పెళ్ళిపై ఇంకా రచ్చ ముగియలేదు. మరోసారి ఆమెను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. పీటర్ పాల్‌తో మూడో పెళ్లి చేసుకున్న నేపథ్యంలో వనితని చాలా మంది టార్గెట్ చేస్తూ చీవాట్లు పెట్టారు. అయినా వనిత వారికి తనదైన శైలిలో బదులిచ్చింది. అయినప్పటికీ వనిత నెటిజన్స్ నుండి ట్రోల్స్‌ని ఎదుర్కొంటూనే ఉంది. తాజాగా ఈ అమ్మడు ఓ ఫోటో వలన హాట్ టాపిక్‌గా మారింది.
 
వనిత ఒక వ్యక్తితో అత్యంత సన్నిహితంగా ఫొటో దిగింది. అందులో ఆ వ్యక్తి వనిత బుజాల మీద చేతులు వేసుకుని వున్నాడు. ఇక వనిత చేతిలో మందు గ్లాస్ ఉంది. దాంతో వనిత మరోసారి సోషల్ మీడియాలో టార్గెట్ అయ్యింది. 
 
ఇతను నాలుగో భర్తనా అంటూ నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. దీనిపై వనిత తనకు ఆప్తుడని చెప్పింది. పక్కనే ఆయన భార్య కూడా వున్నారు. ఆమె ఫొటోను క్రాప్ చేసి కొందరు దీని వరకే షేర్ చేసి నన్ను ట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.