మంగళవారం, 26 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 21 ఫిబ్రవరి 2023 (12:53 IST)

'శంకరాభరణం' చిత్రం ఎడిటర్ జీజీ కృష్ణారావు కన్నుమూత

ggkrishnarao
కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన "శంకరాభరణం" చిత్రానికి ఎడిటర్‌గా పనిచేసిన జీజీ కృష్ణమూర్తి ఇకలేరు. ఆయన మంగళవారం బెంగుళూరులో వృద్దాప్య సమస్యల కారణంగా చనిపోయారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈయన తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సీనియర్ దర్శకులందరి వద్ద పని చేశారు. ముఖ్యంగా, దాసరి నారాయణ రావు, కె.విశ్వనాథ్‌ వంటి లెజండరీ దర్శకుల సినిమాలకు పని చేశారు.
 
కె.విశ్వనాథ్ రూపొందించిన "శంకరాభరణం", "సాగరసంగమం", "స్వాతిముత్యం", "శుభలేక" వంటి సినిమాలతో ఆయన తెరకెక్కించిన అన్ని చిత్రాలకు ఎడిటర్‌గా పని చేశారు. అలాగే, దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన "బొబ్బిలిపులి", "సర్దార్ పాపారాయుడు" వంటి చిత్రాలతో పాటు దాదాపు 200కి పైగా చిత్రాలకు పని చేశారు. కృష్ణారావు మృతిపట్ల పలువురు ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈయ
 
కాగా, ఈ నెల రెండో తేదీన కె.విశ్వనాథ్ కన్నుమూశారు. ఆ తర్వాత మూడో తేదీన ప్రముఖ గాయనీమణి వాణీజయరామ్ తుదిశ్వాస విడిచారు. గత శనివారం హీరో తారకరత్న కన్నుమూశారు. ఇపుడు ఎడిటర్ కృష్ణారావు చనిపోయారు. ఇలా వరుస మృతులతో తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. కృష్ణారావు తెలుగులో తన సినీ కెరీర్‌ను పాడవోయి భారతీయుడా అనే చిత్రం ద్వారా మొదలుపెట్టారు.