శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 17 అక్టోబరు 2019 (18:11 IST)

సైరా పై వెంక‌య్య‌నాయుడు స్పంద‌న ఏంటి..?

మెగాస్టార్ చిరంజీవి ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లిసిన విష‌యం తెలిసిందే. నిన్న‌ చిరంజీవి ఢిల్లీ వెళ్లి ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడుని క‌లిసారు. ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత క‌థ ఆధారంగా రూపొందించిన సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రాన్ని ఉపరాష్ట్రపతి నివాసంలో ప్రత్యేకంగా ప్రదర్శించారు. 
 
ఈ సంద‌ర్భంగా ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు స్పందిస్తూ... బ్రిటిష్ వారి అరాచకాలను ఎదిరిస్తూ.. స్వాతంత్ర సమరయోధుడు శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన పోరాట స్ఫూర్తితో.. రూపొందించిన 'సైరా' చిత్రం బాగుంది.
 
 నటులు శ్రీ చిరంజీవి, శ్రీ అమితాబ్ బచ్చన్,  దర్శకుడు శ్రీ సురేందర్ రెడ్డికి అభినందనలు. నిర్మాత శ్రీ రామ్ చరణ్ తేజ్‌కు ప్రత్యేక అభినందనలు. 
 
ఊరువాడా చూడదగిన ఉత్తమ చిత్రం 'సైరా'. చాలా కాలం తర్వాత చక్కని, ప్రేరణా దాయకమైన చిత్రం చూసే అవకాశం లభించింది. వలస పాలకుల దుర్మార్గాలను చాలా చక్కగా చిత్రీకరించారు. నిర్మాత, నటీనటులు, దర్శకుడు, సాంకేతిక నిపుణులు అందరికీ అభినందనలు అన్నారు.