శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 20 జనవరి 2018 (14:24 IST)

ఆచారి అమెరికా యాత్ర టీజర్ వైరల్.. రిపబ్లిక్ డేకి విడుదల

మంచు విష్ణు హీరోగా 'ఆచారి అమెరికా యాత్ర' చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల కానుంది. 'ఆచారి అమెరికా యాత్ర' చిత్ర టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, వి

మంచు విష్ణు హీరోగా 'ఆచారి అమెరికా యాత్ర' చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల కానుంది. 'ఆచారి అమెరికా యాత్ర' చిత్ర టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, విష్ణుల కాంబినేషన్ కామెడీ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలవనుంది.

ఎస్.ఎస్. తమన్ స్వరపరిచిన 'స్వామి రా రా' అనే బీట్ ప్రధానంగా సాగే పాట ప్రేక్షకుల చేత స్టెప్పులేయించెలా ఉండగా, సంక్రాంతి నాడు విష్ణు విడుదల చేసిన మరో పాట 'చెలియా' సంగీత ప్రియులను అలరిస్తోంది.
 
ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటించిన ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు. పురోహిత్యం చేసే గురు శిష్యులుగా ఈ ట్రైలర్‌లో బ్రహ్మానందం .. విష్ణు కనిపిస్తున్నారు. హోమం చేసేందుకు గురు శిష్యులు అమెరికా వెళ్తారు. అక్కడ వారికి ఎదురయ్యే సంఘటనలతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. 
 
తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాస్ రావు, పోసాని కృష్ణ మురళి, పృథ్వి, ప్రవీణ్, విద్యుల్లేఖ  రామన్, ప్రభాస్ శ్రీను, ప్రదీప్ రావా, ఠాకూర్ అనూప్ సింగ్, సురేఖ వాణి తదితరులు నటించిన ఈ చిత్రానికి  నిర్మాతలు: కీర్తి చౌదరి, కిట్టు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : జి నాగేశ్వర రెడ్డి.