సోమవారం, 22 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 16 ఆగస్టు 2022 (16:03 IST)

నిహారిక అంటే భయం..కాలేజీ రోజుల్లో బెదిరించేది.. భయపడేవాడిని (video)

Vishwaksen
Vishwaksen
మెగా డాటర్ నిహారిక నిర్మించిన హలో వరల్డ్ వెబ్ సిరీస్ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీలలో ఒకటైన జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ఈవెంట్‌కు విశ్వక్ సేన్ గెస్ట్‌గా హాజరై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 
తాను మాస్ కమ్యూనికేషన్‌లో జర్నలిజం చేశానని విశ్వక్ సేన్ పేర్కొన్నారు. కాలేజ్‌లో చదువుకునే సమయంలో తాను ఎవరికీ భయపడేవాడిని కాదని విశ్వక్ సేన్ చెప్పారు. అయితే కాలేజ్‌లో నిహారిక కొణిదెల అనే ఒక సీనియర్ ఉండేదని ఆమెకు మాత్రం భయపడేవాడినని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చారు. 
 
కాలేజ్‌లో చదువుకునే సమయంలో నిహారిక ఏయ్ అంటూ బెదిరించేదని విశ్వక్ సేన్ కామెంట్లు చేశారు. కాల్ చేసి నిహారిక ఏయ్ అని అన్న వెంటనే హలో వరల్డ్ వెబ్ సిరీస్ ఈవెంట్‌కు తాను హాజరయ్యానని విశ్వక్ సేన్ కామెంట్లు చేశారు. ప్రస్తుతం నిహారిక మెగా లేడీ ప్రొడ్యూసర్ అని విశ్వక్ సేన్ అభిప్రాయపడ్డారు. 
 
విశ్వక్ సేన్ మాట్లాడుతున్న సమయంలోనే మైక్ ఆగిపోతే నువ్వే మైక్ ఆపించావా అంటూ విశ్వక్ సేన్ నిహారికపై సెటైర్లు వేశారు. విశ్వక్ సేన్ నిహారిక గురించి వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.