1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 జూన్ 2022 (19:59 IST)

ఉదయభానును ఓ ఆటాడుకున్న విశ్వక్‌సేన్..

Vishwaksen
Vishwaksen
ఈటీవీలో ప్రసారమయ్యే గ్యాంగ్ లీడర్ షోలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది ఉదయభాను. గతంలో యాంకర్‌గా తన కెరీర్ ప్రారంబించిన ఉదయభాను సినిమాల్లోనూ కనిపించింది. తరువాత కాలంలో ఎందుకో దూరమైంది. మళ్లీ ఇప్పుడు తన ప్రస్థానాన్ని తిరిగి ప్రారంభించి పలు కార్యక్రమాల్లో కనిపిస్తోంది. 
 
ఈ మేరకు చోర్ బజార్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు యాంకర్‌గా వచ్చింది. దీంతో ఆమె ఇటీవల మెల్లమెల్లగా షోల్లో తన మాటలతో అదరగొడుతోంది. ఈ షో కు ముఖ్య అతిథిగా యంగ్ స్టార్ విశ్వక్ సేన్ హాజరయ్యారు.
 
దీంతో ఉదయభాను ఆయనను స్టేజీపైకి ఆహ్వానించింది. ఆయన వస్తూనే ఉదయభానుపై పంచుల వర్షం కురిపించారు. దీనికి ఆమె చిన్నబోయింది.
 
"నేను చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను అని విశ్వక్ సేన్ చెబితే నేను కూడా చాలా రోజుల నుంచి మిమ్మల్ని కలవాలనుకుంటున్నా కుదరలేదని చెప్పగా మీరు చిన్నప్పుడు నేను ఇంకా పుట్టలేదు" అని కౌంటర్ ఇవ్వడంతో అందరు నవ్వుకున్నారు.
 
మీకు నాకు నాలుగైదు ఏళ్లు తేడా ఉంటుంది అంతే అన్నా పెద్దగా రియాక్షన్ లేదు. దీంతో విశ్వక్ సేన్ ఉదయభానును తన పంచులతో ఆడుకున్న విషయాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.