శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 3 జనవరి 2022 (18:37 IST)

ఆప్తులైన వ్యక్తిని కోల్పోయాం- కృష్ణ‌

PC reddy- krishna
ప్రముఖ దర్శకులు పి.చంద్రశేఖర్ రెడ్డి మృతి చెందిన వార్త తెలియ‌గానే ఘ‌ట్ట‌మ‌నేని కృష్ణ ఇలా స్పందించారు. ఆయ‌న‌తో త‌న‌కు గ‌ల అనుభ‌వాన్ని వివ‌రించారు. ప‌లు సినిమాలు ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేశామ‌ని పేర్కొన్నారు.
 
పి.చంద్రశేఖర్ రెడ్డి గారు నాకు వ్యక్తిగతంగా మరియు మా కుటుంబానికి అత్యంత సన్నిహితంగా కలిసిపోయే ఆప్తులు. ఆయన దర్శత్వంలో వచ్చిన తొలిచిత్రం లో హీరోగా నేను నటించాను, తొలిచిత్రం అత్త‌లు కోడళ్ళు,రెండవచిత్రం అనురాధ కూడా నేనే హీరో, మా ఇద్దరి కాంబినేషన్ లో 23 చిత్రాలు వచ్చాయి, వాటిలో ఇల్లు ఇల్లాలు, కొత్త కాపురం, పాడిపంటలు,నాపిలుపే ప్రభంజనం మంచి హిట్స్, మా  పద్మాలయ అనుబంధ సంస్థలో ఆయన డైరెక్టర్ గా కూడా వ్యవహరించారు, మేము చాలా ఆప్తులైన వ్యక్తిని కోల్పోయాం, వారి కుటుంబానికి మా సానుభూతి, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడు ని ప్రార్థిస్తున్నామ‌ని నివాళుల‌ర్పించారు.