మంగళవారం, 26 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : సోమవారం, 25 ఆగస్టు 2025 (17:38 IST)

Anushka : క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి మూడుసార్లు లాఠీ చార్జ్ చేశాం : నిర్మాత రాజీవ్ రెడ్డి

Ghati - Producer Rajeev Reddy
Ghati - Producer Rajeev Reddy
ఒక ఫిమేల్ సూపర్ స్టార్ తో కమర్షియల్ యాక్షన్ మూవీ చేయాలనేది మెయిన్ ఐడియా. కర్తవ్యం తర్వాత ఆ స్కేల్లో మళ్ళీ సినిమా రాలేదు. ఇప్పుడున్న స్టార్స్ లో అనుష్క కి అలాంటి స్టార్డం ఉంది. క్రిష్, అనుష్కతో ఒక ప్రాజెక్టు చేయాలనుకున్నప్పుడు ఘాటి స్టార్ట్ అయింది అని  నిర్మాత రాజీవ్ రెడ్డి అన్నారు.
 
అనుష్క శెట్టి యాక్షన్ డ్రామా ఘాటి. విక్రమ్ ప్రభు మేల్ లీడ్ గా నటించిన ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. UV క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. సెప్టెంబర్ 5న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపధ్యంలో నిర్మాత రాజీవ్ రెడ్డి నేడు పలు సినిమా విశేషాల్ని పంచుకున్నారు.  
 
-అరుకు, గాంజా బ్యాక్ డ్రాప్ లో ఒక కథ చేయాలనుకున్నాం. అయితే అది సినిమాగా చేయాలా వెబ్ సిరిస్ గా చేయాలని డిస్కషన్ వుండేది. ఫైనల్ గా అనుష్క తో సబ్జెక్టుని అనుకున్న తర్వాత మూవీ వర్క్ చేయడం మొదలుపెట్టాం. ఇది కంప్లీట్ గా ఫిక్షనల్ స్టోరీ. దీనికి ఎలాంటి రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్ లేదు. ఆంధ్ర ఒరిస్సా బోర్డర్స్ లో ఎక్కువగా షూట్ చేశాం. ఒరిస్సాలో షూట్ చేసినప్పుడు అక్కడ లోకల్ పీపుల్స్ చాలా సపోర్ట్ చేశారు. 
 
- అనుష్క క్యారెక్టర్ టీజర్ ట్రైలర్ లో ఎంత ఇంటెన్సిటీ చూసారో సినిమాలో కూడా అంతే ఇంటెన్స్ గా ఉంటుంది. ఇది ఫుల్ యాక్షన్ సినిమా. క్రిష్ మార్క్ డ్రామా ఉంటుంది. అనుష్క గారి పెర్ఫార్మన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.  
 
-ఒరిస్సాలో ఒక బార్డర్ ఏరియాలో మేము షూట్ చేశాము. షూట్ కి వెళ్ళేటప్పుడు దాదాపు వేలాదిజనం అనుష్క చూడ్డానికి వచ్చేవారు. క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి రెండు మూడుసార్లు లాఠీ చార్జ్ కూడా అయింది. అనుష్క కి దేశవ్యాప్తంగా ఆ స్థాయి ప్రేక్షకాదరణ ఉంది. ఘాటిలో విజువల్స్ అవుట్ స్టాండింగ్ గా ఉంటాయి. ఆడియన్స్ కి విజువల్ ట్రీట్ ఉంటుంది.
 
- ఘాటికి పార్ట్ 2 ఆలోచన లేదు. ఆడియన్స్ అందరూ కలిసి పెద్ద హిట్ చేస్తే అప్పుడు పార్ట్ 2 ఆలోచిస్తాం. అయితే ఈ కథకి పార్ట్ 2 చేసే స్కోప్ ఉంది.  వీరి కాంబినేషన్లో వచ్చిన వేదం చాలా పెద్ద హిట్. కచ్చితంగా ఈ సినిమా దానికి రీచ్ అవుతుందనే నమ్మకం మాకుంది.  
 
- ఘాటి బ్యాగ్రౌండ్ స్కోరు సాగర్  చాలా అద్భుతంగా ఇచ్చారు. క్రిష్ గారు ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. మా సినిమాలన్నిటిలో పోస్ట్ ప్రొడక్షన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఘాటి కూడా అద్భుతమైన స్కేల్లో ఉంటుంది.
 
- వరుణ్ తేజ్ తో చేస్తున్న సినిమా దాదాపు 80% షూటింగ్ కంప్లీట్ అయింది. అది చాలా మంచి హారర్ కామిడీ ఎంటర్టైనర్.
 
- కొత్తగా చేస్తున్న వెబ్ కంటెంట్ అరేబియన్ కడలి సీజన్ 2 స్క్రిప్ట్ వర్క్స్ జరుగుతున్నాయి.  అలాగే అమెజాన్ కి ఒక ఒరిజినల్ ఫిలిం చేయబోతున్నాం. ఇంకొన్ని స్క్రిప్స్ రెడీగా ఉన్నాయి. ఘాటీ రిలీజ్ తర్వాత వాటి అనౌన్స్మెంట్స్ వస్తాయి.