మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 డిశెంబరు 2023 (15:51 IST)

"యానిమల్" పాటతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది.. ఆమె ఎవరు?

Jamal Kudu
Jamal Kudu
"యానిమల్‌" సినిమా సూపర్‌హిట్‌ క్లబ్‌లో చేరింది. ఈ చిత్రానికి సంబంధించిన డైలాగ్స్, పాటలు, యాక్షన్ సన్నివేశాలు వైరల్‌గా మారాయి. ఇందులోని 'జమాల్ కుడు' పాట ఈ రోజుల్లో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. 
 
నెటిజన్లు ఈ పాటకు రీల్స్ చేయడం సోషల్ మీడియాలో పోస్టు చేయడం పనిగా పెట్టుకున్నారు. ఈ పాట యానిమల్ చిత్రంలో బాబీ డియోల్ ఎంట్రీ సందర్భంగా ఉంటుంది. కానీ పాటలో కనిపించిన నటి రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సంచలనంగా మారింది. 
 
ఆమె గురించి అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు. ఆమె గురించి సెర్చ్ చేస్తున్నారు. 'జమాల్ కుడు' అమ్మాయి ఎవరు?  'జమాల్ కుడు' అమ్మాయి పేరుతో ఫేమస్ అవుతున్న ఈ నటి పేరు తనాజ్ దావూదీ. ఇరానియన్ మూలానికి చెందిన తనాజ్, వృత్తిరీత్యా మోడల్, డాన్సర్. ఈమె భారతదేశంలో నివసిస్తున్నారు.

తనాజ్ ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో జన్మించింది. బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్‌గా కెరీర్ ప్రారంభించింది. ఇప్పటి వరకు ఆమె జాన్ అబ్రహం, వరుణ్ ధావన్, నోరా ఫతేహితో కలిసి నటించింది.