గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసుదేవన్ ఆరంబాకం
Last Updated : మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (11:46 IST)

ఆర్జీవీ వర్సెస్ చంద్రన్న... ఈ వెన్నుపోట్లు నిజమేనా? వర్మ పోల్

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి మరోసారి జనాలలోకి తన బాణాన్ని సంధించాడు... ఇటీవలి కాలంలో... చంద్రబాబునీ, బాలయ్యనీ టార్గెట్ చేసుకున్న ఆర్జీవీ... ఇప్పుడు మరోసారి తన ట్విట్టర్ ఖాతాలో జస్ట్ ఆస్కింగ్... ఇది నిజమేనా? అంటూ ఓ పోల్ ను ఉంచారు. అందులో ఈ క్రింది ప్రశ్నలు సంధించాడు... 
 
వివరాలలోకి వెళ్తే... 
చంద్రబాబునాయుడు...
1983లో కాంగ్రెస్ ను వెన్నుపోటు పొడిచారా?
1989లో ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారా?
1998లో యునైటెడ్ ఫ్రెంట్ ను వెన్నుపోటు పొడిచారా?
2004లో బీజేపీని వెన్నుపోటు పొడిచారా?
2009లో టీఆర్ఎస్ ను వెన్నుపోటు పొడిచారా?
2013లో వామపక్షాలకు వెన్నుపోటు పొడిచి తిరిగి బీజేపీలో చేరారా?
2018లో బీజేపీకి వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ లో చేరారా?
 
అని ప్రశ్నిస్తూ, 'యస్' ఆర్ 'నో' చెప్పవలసిందిగా ఒక పోల్ ను ప్రారంభించారు. 
ఈ పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారుతోంది.