శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 5 మే 2019 (14:47 IST)

తమిళ నటుల అరెస్టుకు హైకోర్టు ఆదేశం

ప్రముఖ తమిళ నటులు శరత్‌ కుమార్‌, రాధారవి అరెస్టుకు మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో సినీనటుల సంఘానికి శరత్‌కుమార్‌ అధ్యక్షునిగా.. రాధారవి కార్యదర్శిగా ఉన్నారు. వారి హయంలో కాంచీపురం జిల్లా వెంకటమంగళంలో ఉన్న సినీనటుల సంఘానికి చెందిన స్థలాన్ని అక్రమంగా విక్రయించారని 2017లో ఓ వ్యక్తి పిటిషన్‌ దాఖలు చేశారు. 
 
ఈ పిటిషన్‌పై తాజాగా విచారించిన మద్రాస్‌ హైకోర్టు.. 3 నెలల్లో స్థల విక్రయం కేసును తేల్చి శరత్‌కుమార్‌, రవిలను అరెస్ట్‌ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం నడిగర్‌ సంఘానికి హీరో విశాల్‌ సెక్రటరీగా ఉన్నాడు. తప్పుడు పత్రాలు సృష్టించి, డాక్యుమెంట్లలో మార్పలు చేసి యూనియన్‌కు చెందిన ఆస్తిని అక్రమంగా విక్రయించారని విశాల్‌ కూడా ఆరోపించిన విషయం తెలిసిందే. 
 
కొన్నినెలల క్రితమే ఈ కేసు కోర్టులో విచారణకు వచ్చింది. తన వాదనలకు బలం చేకూరేలా ఆధారాలు ఉంటే కేసు నమోదు చేయొచ్చని కోర్టు విశాల్‌కు సూచించింది. శనివారం కేసుపై వాదనలు విన్న కోర్టు అవసరమైతే వారిద్దరి అరెస్టు చేసి వారిని విచారించాలని కాంచీపురం క్రైమ్‌ బ్రాంచ్‌ను న్యాయస్థానం ఆదేశించింది.