ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 2 ఆగస్టు 2017 (10:16 IST)

నా హీరో చాలా గ్రేట్ అంటోన్న సమంత: యుద్ధం శరణం టీజర్‌ను 11 లక్షల మందికిపైగా చూశారు.. (వీడియో)

అక్కినేని నాగార్జున కోడలు కథానాయిక సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటున్న సంగతి తెలిసిందే. యంగ్ హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకోనున్న సమంత తాజాగా తన హీరో గురించి నోరు విప్పింది. ఆమె చైతూను

అక్కినేని నాగార్జున కోడలు కథానాయిక సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటున్న సంగతి తెలిసిందే. యంగ్ హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకోనున్న సమంత తాజాగా తన హీరో గురించి నోరు విప్పింది. ఆమె చైతూను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు. నాగచైతన్య హీరోగా నటిస్తున్న చిత్రం ‘యుద్ధం శరణం’.

ఈ సినిమా టీజర్‌ను సోమవారం విడుదల చేశారు. దీన్ని చైతూ ట్విటర్‌ వేదికగా పంచుకుంటూ.. "శత్రువులు ద్రోహం చేసినా. ఆశలు ఆవిరైనా. నా గూడు చెదిరినా.. నేను ధైర్యంగా జీవించగలను" అని ట్వీట్‌ చేశారు. దీన్ని సమంత రీట్వీట్‌ చేస్తూ.. "నా హీరో చాలా గ్రేట్" అని వెల్లడించింది. 
 
ఇదిలా ఉంటే.. నాగచైతన్య హీరోగా వారాహి చలనచిత్ర బ్యానర్‌పై రూపొందుకుంటున్న కొత్తచిత్రం 'యుద్ధం శరణం'. ఈ సినిమాకు చెందిన టీజర్లో హీరోయిన్ లావణ్య త్రిపాఠిని చూపిస్తూ.. కొన్ని సరదా సన్నివేశాలు, మరికొన్ని యాక్షన్ సన్నివేశాలతో కూడిన టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ టీజర్ లోని సన్నివేశాలతో పాటు శ్రీకాంత్ లుక్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
 
ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో నెంబర్ వన్ స్థానంలో వుంది. 11 లక్షల మందికిపైగా టీజర్‌ను చూశారు. 24 వేల మంది లైక్‌ చేశారు. ఆర్‌.వి. కృష్ణ దర్శకుడు. రజనీ కొర్రపాటి నిర్మాత. లావణ్య త్రిపాఠి, శ్రీకాంత్‌, రావు రమేశ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వివేక్‌ సాగర్‌ సంగీతం అందిస్తున్నారు.