బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 24 నవంబరు 2018 (21:24 IST)

కొన్నాళ్లపాటు లేడీస్ హాస్టల్ వైపు వెళ్లడం మానేస్తే...

భర్త : డార్లింగ్ మన పెళ్లయిన ఈ ఒక్కరోజులోనే నీలో లోపాలెన్ని ఉన్నాయో కనిపెట్టాను.
భార్య : ఒప్పుకుంటానండి నాలో లోపాలు ఉండబట్టే మంచి భర్తను పొందలేకపోయాను అని అమాయకంగా అంటించింది.
 
2. 
పేషంట్: ఈమధ్య కళ్లు బాగా లాగేస్తున్నాయి డాక్టర్.
డాక్టర్: కొన్నాళ్లపాటు లేడీస్ హాస్టల్ వైపు వెళ్లడం మానేయండి
 
3.
రవి: ఫోన్ ఎత్తి ఒక్క మాట మాట్లాడకుండా అరగంట నుంచి అలానే ఉండిపోయావే.
రాము: అవతల మా ఆవిడ ఆపితే మాట్లడదామని.
 
4.
బంటి: నాన్నా చూచి రాత మంచిదేనా,
నాన్న: చాలా మంచిది రోజు రాయాలి,
బంటి: నిన్న పరీక్షలో జవాబు చూచి రాస్తుంటే టీచర్ బయటకు పంపించేశారేంటి?