ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
Written By మోహన్
Last Updated : సోమవారం, 29 ఏప్రియల్ 2019 (17:56 IST)

లక్ష్మీస్ ఎన్టీఆర్ పార్ట్-2 తీస్తానని వర్మ ప్రకటన..

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం హైడ్రామాల మధ్య ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మినహా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే ఎన్నో విమర్శలు మరెన్నో వివాదాలు కోర్టులు, కేసులు అనంతరం ఈ సినిమా మే 1వ తేదీన ఏపీలో కూడా విడుదల కాబోతుంది.
 
ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏపీకి వెళ్లిన వర్మను అక్కడ పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఆపై వర్మను హైదరాబాద్‌కు బలవంతంగా పంపేయగా, వర్మ ఈ వివాదాలకు సంబంధించి ఈరోజు హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టారు. 
 
ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. త్వరలో లక్ష్మీస్ ఎన్టీఆర్ పార్ట్-2 చిత్రాన్ని కూడా తీస్తానని వెల్లడించారు. కాగా పార్ట్-1లో ఎన్టీఆర్ చనిపోయేంతవరకు చూపించిన వర్మ పార్ట్-2లో ఏమి చూపిస్తారనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగానూ, సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.