1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
Written By ivr
Last Modified: గురువారం, 4 జూన్ 2015 (17:20 IST)

జూన్ 26న 'రుద్రమదేవి' విడుదల... 'బాహుబలి' వస్తే ఏమవుతుందో...?!!

రెండు భారీ బడ్జెట్ చిత్రాలు ఒక దాని తర్వాత ఇంకొకటి విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు చిత్రాల్లోనూ అనుష్క నటించింది. అనుష్క ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన రుద్రమదేవి చిత్రం విడుదలలో జాప్యం చోటుచేసుకుంటూ వచ్చింది. ఐతే దర్శకనిర్మాత అయిన గుణశేఖర్ ఇవాళ మరోసారి క్లారిటీ ఇచ్చారు. 
 
జూన్ 26న రుద్రమదేవి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రం విడుదల వాయిదాలు పడుతూ వచ్చింది. దీనికి కారణం, ఆర్థికపరమైన ఇబ్బందులనే వాదనలున్నాయి. ఏదేమైనప్పటికీ ఎట్టకేలకు ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు గుణశేఖర్ వెల్లడించారు. బాహుబలి చిత్రం కూడా జూలై నెలలో విడుదల కాబోతోంది. చూడాలి.. ఈ రెండు చిత్రాల మధ్య పోటీ ఎలా ఉంటుందో...?!!