శనివారం, 16 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
Written By వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT

"నీలవేణి"లో ఆర్తీ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ లుక్

ముఖుల్‌దేవ్‌, ఆర్తీ అగర్వాల్‌ జంటగా భరత్‌ పారేపల్లి దర్శకత్వంలో ఎం.జి.ఆర్‌. కంబైన్స్‌ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం నీలవేణి. ఈ చిత్రం షూటింగ్‌ ఇప్పటివరకూ 80 శాతం పూర్తయింది. ఈనెల 10 నుంచి 28 వరకు జరిగే షూటింగ్‌తో మొత్తం పూర్తవుతుంది. 

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ, "ఈ చిత్రానికి కథతోపాటు సంగీతం, రామ్‌లక్ష్మణ్‌ల ఫైట్స్‌ హైలైట్‌గా నిలుస్తాయి. ఆర్తీ అగర్వాల్‌ కెరీర్‌లో చెప్పుకోదగ్గ చిత్రమవుతుంది. ఐదు పాటలు, నాలుగు బిట్‌ సాంగ్స్‌ ఉన్నాయి. తను ప్రేమించి ప్రియుడిని తనకు కాకుండా చేసిన కొందరు దుర్మార్గులకు నీలవేణి ఎలా బుద్ధి చెప్పింది.. అనే అంశంతో రూపొందుతోంది. సెప్టెంబర్‌ 10న ఆడియోను, దసరానాడు సినిమాను విడుదలచేయనున్నామ"ని తెలిపారు.

ఈ చిత్రానికి కెమెరా: ఆళ్ళ రాంబాబు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: భరత్‌ పారేపల్లి.