ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 12 జులై 2024 (15:28 IST)

భారతీయుడు 2 సినిమా గొప్పతనం ఏంటో తెలుసా.. రివ్యూ

Bharatiyadudu 2
Bharatiyadudu 2
దర్శకుడు శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ భారతీయుడు (ఇండియన్)కు సీక్వెల్ అనగానే 28ఏళ్ల క్రితం వచ్చిన ఆ సినిమా గుర్తుకు వస్తుంది. అప్పటి తరం యాభై ఏళ్ళకు దగ్గరకు చేరుకోవడంతో ఈసారి హైటెక్ జనరేషన్, సోషల్ మీడియా యూత్ ను ద్రుష్టిలో పెట్టుకుని, సోషల్ మీడియాలోనూ ఇతరర్రతా వచ్చిన వార్తలను బేస్ చేసుకుని సినిమా తీశాననీ, పేర్లు, వ్రుత్తులు కలిస్తే సంబంధంలేదని అంతా కల్పితమని ముందుగానే స్లయిడ్ వేశాడు శంకర్.
 
కథ:
సిద్దార్థ్ అతని స్నేహితులు బార్కింగ్ డాగ్స్ పేరుతో యూట్యూబ్ రన్ చేస్తూ ఒకవైపు అవినీతి అక్రమాలపై సెటైర్ వీడియోలు తీస్తూ కొద్దోగొప్పే సంపాదించుకుంటుంటారు. తమ కళ్ళ ముందు జరుగుతున్న దారుణాలు చూడలేక ఇలాంటి వారిని కాపాడాలంటే సేనాపతి (తాత, భారతీయుడు) మళ్ళా రావల్సిందే అని ప్రబలంగా అనుకుంటారు. అలా సోషల్ మీడియాలో యూత్ భారతీయుడు (ఇండియన్) కమ్ ఇండియా అంటూ పెట్టిన పోస్ట్ లకు యావత్ ప్రపంచం రియాక్ట్ అవుతుంది.
 
అలా తైపీలో వున్న భారతీయుడికి ఇండియాలో మీ అవసరం వుందని సిద్దార్థ్ ఫ్రెండ్ చెప్పడంతో సేనాపతి వస్తాడు.  అలా ఎయిర్ పోర్ట్ రాగానే సి.బి.ఐ. అరెస్ట్ చేయడానికి ్రటై చేస్తే తప్పించుకుని పారిపోతాడు అలా పారిపోయి అక్రమార్కులకు, అవినీతి పరులకు తనదైన శైలిలో మర్మకళతో శిక్షలు విధిస్తాడు. భారతీయుడు (తాత) తాము పిలిస్తే వచ్చాడనే సంతోషంలో వున్న సిద్దార్థ్ అండ్ టీమ్ తో.. ముందు మనఇంటిలో వున్న కలుపుమొక్కలను పీకేయండి. అనే సూచన చేస్తాడు. ఇంటినుంచే ప్రక్షాళన చేయాలంటాడు. అలా చేసే క్రమంలో పెద్ద సమస్యే వచ్చి పడుతుంది. అది ఏమిటి? మరోవైపు సి.బి.ఐ., పోలీసులు, రౌడీలంతా కలిసి భారతీయుడ్ని పట్టుకుని మట్టుబెట్టాలన్న వారి కోరిక తీరిందా? లేదా? అనేది మిగిలిన సినిమా.
 
Bharatiyadudu 2
Bharatiyadudu 2
సమీక్ష:
 
ఈ సినిమాలో దర్శకుడు శంకర్ కొత్తగా చెప్పిందేమిటంటే.. అవినీతి ప్రక్షాళన మన ఇంటినుంచే మొదలు పెట్టాలని యూత్ ను కోరడం.  ఆ క్రమంలో యూత్ ఎదుర్కొన్న కష్ట నష్టాలు ఏమిటి? అనేది చూపించాడు. అయితే ఈ సీక్వెల్ తీసుకున్న అంశాలన్నీ సోషల్ మీడియాలోనూ, వార్తల్లోనూ వచ్చినవే. వేల కోట్ల రూపాయలు బ్యాంక్ రుణం తీసుకుని విదేశాలకు పారిపోయి అమ్మాయిలతో ఎంజాయ్ చేసే విజయ్ మాల్యా, ఇతరత్రా వ్యక్తుల్ని తన దైన మర్మకళతో ఎలా మట్టుపెట్టాడు అనేది చూపించాడు. 
 
ముఖ్యంగా యూత్ కు జాబ్ లేకపోవడం, లంచం ఇస్తేనే టీచ్ ఉద్యోగం ఇవ్వడం, ఆధార్ కార్డ్ కావాలంటే మూడు వందలు లంచం తీసుకోవడం వంటి అంశాలు దర్శకుడు చూపించాడు.  ఇందులో ప్రత్యేకంగా చెప్పాల్సింది ముగింపుకు ముందు కమల్ హాసన్ సైకిల్ లాంటి వీల్ తో యాక్షన్ సన్నివేశాలు, మర్మకళ ఫైట్స్ ఆకట్టుకుంటాయి. క్లయిమాక్స్ లో తను ఎలా మరలా తప్పించుకున్నాడనేది కూడా బాగుంది. ఇలాంటి కథలతో ఇంకా సీక్వెల్స్ తీయవచ్చని ట్విస్ట్ ఇచ్చాడు దర్శకుడు.
 
సేనాపతి ఇండియన్ కాదు. పాన్ ఇండియన్ అనే డైలాగ్ బాగుంది. సందర్భానుసారంగా వచ్చే డైలాగ్స్ బాగున్నాయి. కామన్ మాన్ కేవలం ఓటువేసే మిషన్ లాంటివాడు. వాడు ప్రశ్నించకూడదు అనేవి కూడా బాగున్నాయి. 
 
ఇన్ని చెప్పిన ఈ సినిమాలో 28ఏళ్ల క్రితం వచ్చిన ఆ సినిమాలో చూపిన అవినీతి ఇప్పుడు వేల కోట్లకు పెరిగిందే మినహా ఎక్కడా తగ్గలేదు. ఈ విషయం ఇప్పటి జనరేషన్ కు పెద్దగా  రుచించకపోవచ్చు. అవినీతి వల్లే దేశం వెనుకబడి పోతుందని ఎన్ని మాటలు చెప్పినా కార్యరూపం దాల్చాల్సింది పాలకులే. కనుక 1902 నుంచి పోరాటాలు చేసి గాంధీ మార్గంలో స్వాతంత్రాన్ని తెచ్చుకున్నా.. ఇంకా అసలు ఫ్రీడమ్ రాలేదు. అందుకే పోరు చేయాల్సిన అవసరం ఇప్పటి యూత్ పైనే వుందని ముగింపు ఇచ్చాడు దర్శకుడు.  కాని ఇండియన్  కంబ్యాక్ అన్న యూత్ గో బ్యాక్.. అనేలా కథ ఉంది. 
 
పాత్రలపరంగా, సాంకేతికపరంగా అందరూ బాగా పనిచేశారనే చెప్పాలి. ఇక అప్పటి సినిమాతో కంపేర్ చేస్తే మటుకు, అప్పట్లో మర్మ కళ అనేది ప్రేక్షకులకు కొత్త ప్రక్రియ.
'భారతీయుడు' అంటే.. తప్పుచేసిన వాళ్ళను మర్మకళతో శిక్షించే పెద్దాయన మాత్రమే కాదు.. తెల్లదొరల గుండెల్లో గుర్రాలు పరిగెత్తించిన అపర సుభాష్ చంద్రబోస్.. 
బ్రిటిష్ కార్యాలయాలపై త్రివర్ణ పాతాకాలను ఎగరేసిన స్వాతంత్ర్య సమరయోధుడు..
తమ వస్తువుల్ని బహిష్కరించారన్న అక్కసుతో.. భారత స్త్రీలను వివస్త్రలుగా చేసి, వారి ఆత్మహత్యలకు కారకులైన బ్రిటిష్ సైన్యాన్ని కత్తి కొక కండగా నరికిన అభినవ ఛత్రపతి..
స్వచ్ఛమైన మనసుతో స్వేచ్చా వాయువులను పీల్చుకొంటూ.. కుటుంబంలోనే దేశాన్ని చూసుకుంటూ బతికిన దేశభక్తుడు.. తాళి కట్టిన ఇల్లాలిని ప్రాణసమానంగా ప్రేమించిన గొప్ప భర్త.. లంచగొండి తనానికి బలైపోయిన కూతుర్ని చూసుకొని గుండె పగిలేలా రోదించిన కన్నతండ్రి..
 
ఏ చేతులతో అయితే ఎత్తుకొని పెంచాడో.. అదే చేతులతో కన్న కొడుకుని.. గుండెల్లో పొడిచి పొడిచి చంపిన సేనాపతి, ఆ క్షణాన అనుభవించిన గుండెకోత ఇప్పుడు గుర్తొచ్చినా మానసంతా బరువెక్కుతుంది.. ఈసారి శంకర్ ఈ విషయాలు మరోలా చూపించాడు. అది యూత్ కు నచ్చితే హిట్ట్ సినిమా.. లేదంటే ఏవరేజ్ గా నిలుస్తుంది.
రేటింగ్ : 3/5