గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డివి
Last Modified: శుక్రవారం, 4 డిశెంబరు 2020 (14:14 IST)

బొంబాట్ రివ్యూ... దుర‌దృష్ట‌వంతుని ప్రేమ క‌థ‌

నటీనటులు : సాయి సుశాంత్ రెడ్డి, సిమ్రాన్ చౌదరి, చాందిని చౌదరి, హేమ‌, త‌నికెళ్ళ భ‌ర‌ణి, వినీత్ ‌కుమార్‌, ఫిష్ వెంక‌ట్ త‌దిత‌రులు.
 
సాంకేతిక‌త‌; దర్శకత్వం : రాఘవేంద్ర వర్మ, రచన : విశ్వాస్ హన్నూర్ : బి జోష్, డైరెక్టర్ : రాఘవేంద్ర వర్మ , నిర్మాత : విశ్వాస్ హన్నూర్ కార్
 
ఓటిటి ప్లాట్ఫామ్ వ‌చ్చాక సినిమాల్లోనూ మార్పు వ‌చ్చింది. ప్రేమ‌క‌థే అయినా కొత్త‌గా మ‌రోటి జోడించి చేస్తుండ‌డం ప‌రిపాటి అయింది. ఆ కోవ‌లోనే -బొంబాట్‌- అనే చిత్రం విడుద‌లైంది.  అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కాబడ్డ “బొంబాట్” సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ:
చిన్న‌త‌నంలోనే దుర‌దృష్ట‌వంతుడిగా పేరు తెచ్చుకున్న విక్కీ(సుశాంత్ రెడ్డి)కి ఓ ప్రొఫెస‌ర్ ప‌రిచ‌యం కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రొఫెస‌ర్ ఏదో కొత్త ప్ర‌యోగం చేస్తుంటాడు. అది విక్కీకి తెలియ‌దు. ఇదిలా వుండ‌గా.. కాలేజీలో చాందిని చౌద‌రిని ప్రేమిస్తాడు.  దుర‌దృష్ట‌వంతుడుకాబ‌ట్టి.. ఏదో సంఘ‌ట‌న‌తో ఆమె దూరం అవుతుంది. ఈ స‌మ‌యంలో అనుకోకుండా ప్రొఫెస‌ర్ కూతురు మాయ (సిమ్రాన్ చౌదరి) కు  చిత్ర‌మైన స్థితిలో విక్కీ ర‌క్ష‌ణ క‌ల్పించాల్సి వ‌స్తుంది. ఓ సంద‌ర్భంలో ఆ మాయ మరెవరో కాదు ఒక హ్యుమనాయిడ్ రోబోట్ అని తెలుసుకుంటాడు. మరి ఇక్కడే మరో సైంటిస్ట్(మాక్రాండ్ దేశ్ పాండే) కూడా పరిచయం అవుతాడు. ఆ త‌ర్వాత క‌థ ఎటువైపు మ‌లుపు తిరిగింది? విక్కీ ప్రేమ చివ‌రికి ఏమ‌యింది? అనేది మిగిలిన సినిమా.
 
విశ్లేష‌ణ‌..
సైంటిఫిక్ డ్రామాను ద‌ర్శ‌కుడు చూపించాడు. మొత్తంగా చూస్తే.. రోబో, టెర్మినేట‌ర్ స్పూర్తిగా అనిపిస్తుంది. రోబోటిక్‌ను త‌మ స్వాధీనం చేసుకోవాల‌నే టెర్ర‌రిస్టుల ఎపిసోడ్ కూడా కాస్త చూపించాడు. అయితే ఇలాంటి సినిమా తీసేట‌ప్పుడు మ‌రికొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకొంటే బాగుండేది. ఇప్ప‌టికే ప‌లు విదేశీ చిత్రాలు చూసిన ప్రేక్ష‌కుడు బొంబాట్‌.. సినిమాను ఆ కోణంలో చూడాల‌నుకుంటాడు. ఏది ఏమైనా ప‌రిమితి బ‌డ్జెట్‌తో ప‌రిమిత న‌టీన‌టుల‌తో తెర‌కెక్కించాడు. ఇందులో ప్ర‌త్యేకంగా కామెడీ కోసం విల‌న్ పాత్ర‌లు వేసే వినీత్‌కుమార్‌ను రోబోటిక్ అమ్మాయిని ప్రేమించే స‌స్నివేశాలు కాస్త ఎంట‌ర్టైన్ చేస్తాయి. చీనీ‌గ‌మ్‌..లాంటి అన్‌క‌న్‌వెంష‌న్ ల‌వ్ స్టోరీలంటే ఇష్ట‌ప‌డే దాదా (వినీత్‌కుమార్‌) ట్రాక్ కాస్త ఆట‌విడుపు.
 
ఏది ఏమైనా.. సైన్సును నాశ‌నం చేయ‌డానికి కాదు. ఇంకా బెట‌ర్ చేయ‌డానికి స‌మ‌జానికి ఉప‌యోగించాల‌నే పాయింట్‌ను ద‌ర్శ‌కుడు చెప్పాడు.  దుర‌దృష్ట‌వంతునికి కూడా రెండో వైపు వుంటుంది. అది విక్కీలో చాందిని చౌద‌రి చూసింది. ఇవి సంద‌ర్భానుసారంగా రాసుకున్న డైలాగ్‌లు.. పొందిక‌గా. మాట‌లు, పాట‌లు వున్నాయి. ఇందులో ఓ పాట‌ను కీర‌వాణి ఆల‌పించాడు.
 
ఇక న‌టీన‌టుల‌ప‌రంగా చెప్పాలంటే.. “ఈ నగరానికి ఏమైంది”లో కనిపించి ఆకట్టుకున్న సుశాంత్ ఈ చిత్రంలో హీరోగా మంచి నటనను కనబర్చాడు. ఓ మాదిరిగా ఓకే అని చెప్పొచ్చు. అలాగే లేటెస్ట్ గా “కలర్ ఫోటో” చిత్రంతో ఆకట్టుకున్న చాందిని చౌదరి ఈ చిత్రంలో చిన్న రోల్ ను కూడా బాగా చేసింది. ఇక అలాగే ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించిన శిశిర్ శర్మ తన పాత్రకు పూర్తి న్యాయం చేసారు.
 
అలాగే మరో సైంటిస్ట్‌గా కనిపించిన మక్రాంద్‌కు అంత స్పేస్ లేకపోయినా ఓకే అని చెప్పొచ్చు. అలాగే ఈ చిత్రంలో సంగీతం అలాగే పాటలు బాగున్నాయ్ అనిపిస్తుంది. అయితే ఈ చిత్రంలో మెయిన్ హైలైట్ మాత్రం సిమ్రాన్ చౌదరి రోల్ అని చెప్పాలి. ఆమెకు ఉన్న పాత్ర కానీ ఆమెపై డిజైన్ చేసిన స‌న్నివేశాలు అండ్ స్టోరీ మాత్రం ఆడియెన్స్‌ను మెప్పించేలా ఉంటాయి. అలాగే ఆమె కూడా తన రోల్‌లో చాలా బాగా చేసింది.
 
క‌థ‌లో చిన్న‌పాటి లోపాటు కూడా వున్నాయి.  నరేషన్లో ఎలాంటి సీరియస్‌నెస్ ఉండదు. అలాగే కొన్ని పాత్ర‌లు కథకు సంబంధం లేకుండా వస్తున్నట్టు అనిపిస్తాయి. వాటికి కూడా స‌రిగ్గా క్లారిటీ ఇస్తే బాగుంటుంది. సైంటిఫిక్ సినిమాల‌యినంత మాత్రాన స‌గ‌టు ప్రేక్ష‌కుడు ఆ స్థాయిలో ఆలోచించ‌లేడు కాబ‌ట్టి.. టెర్ర‌రిస్టు ఎపిసోడ్ వంటివి పూర్తి వివ‌ర‌ణ ఇస్తూ చూపిస్తే మ‌రింత బాగుండేది.
 
రొటీన్‌గా వ‌స్తున్న క‌థ‌ల‌లు కాకుండా ఇలా  సైంటిఫిక్ యాంగిల్ ఖచ్చితంగా చాలా మందికి ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇది మొదట్లో ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. చివ‌రి పది నిమిషాల్లో హీరో చేసే కొన్ని సైంటిఫిక్ ఎపిసోడ్స్ కూడా ఏమంత మెప్పించవు.
 
ఇలాంటి సినిమాల‌కు కెమెరా ప‌నిత‌నం అలాగే కొన్ని అవసరమైన సన్నివేశాల్లో మంచి గ్రాఫికల్ తీరులో మంచి నిర్మాణ విలువలు తెలుస్తాయి. అలాగే పాటల్లో సాహిత్యం కూడా బాగున్నాయి. దర్శకుడు రాఘవేంద్ర వర్మ మ‌రింత మెలుకువ‌ల‌తో తీస్తే చిత్ర స్థాయి మ‌రో రేంజ్‌లో వుండేది.
రేటింగ్‌: 3/5