సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By selvi
Last Updated : శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (18:19 IST)

C/O కంచరపాలెం రివ్యూ రిపోర్ట్- కొత్తవారితో హిట్ కొట్టేశారు..

ఈ సినిమాలో నటించిన నటీనటులెవ్వరూ తెలుగు ప్రేక్షకులకు అస్సలు ముఖ పరిచయం లేని వారు. అయినా తమ పాత్రలు ఈ నటులు పూర్తి న్యాయం చేశారు. సినిమాలో సహజత్వం కొట్టొచ్చినట్టుగా కనబడింది. ఎవరికి వారే తమ పాత్రల్లో చ

సినిమా పేరు.. C/O కంచరపాలెం
నటీనటులు: సుబ్బారావు, రాధ బెస్సీ, కేశవ కర్రీ, నిత్య శ్రీ, కార్తీక్‌ రత్నం, విజయ ప్రవీణ, మోహన్‌ భగత్‌ తదితరులు
దర్శకత్వం: వెంకటేష్ మహా
నిర్మాత : ప్రవీణ పరుచూరి 
బ్యానర్: సురేష్ ప్రొడక్షన్స్
సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాడి,వరుణ్‌ ఛాపేకర్ 
 
యంగ్ టాలెంటెడ్ దర్శకుడు వెంకటేశ్ మ‌హా దర్శకత్వంలో బడా నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్‌లో రానా సమర్పకుడిగా విజయ ప్రవీణ నిర్మాణంలో తెరకెక్కిన C/O కంచరపాలెం చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం ఈ ఏడాది న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌కు తెలుగు నుంచి ఎంపికైన సినిమాగా నిలిచింది. 
 
అలాగే ఈ చిత్రం మీద సెలబ్రిటీస్ ట్వీట్స్ సినిమా మీద మరింత ఆసక్తిని పెంచేలా చేశాయి. చిత్ర బృందానికి సినిమాపై ఉన్న నమ్మకంతో హైదరాబాద్‌లో రామానాయుడు స్టూడియోస్‌లో ఒక వారం ముందు నుండే ప్రిమియర్ షోల ప్రదర్శించారు. దీంతో ఈ సినిమాకు ప్రమోషన్ బాగా కలిసొచ్చింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా రివ్యూ రిపోర్ట్ ఎలా వుందో చూద్దాం.. 
 
కథలోకి వెళితే.. 
వైజాగ్‌లోని కంచరపాలెం అనే ఊరిలో ప్రేమజంటల కథే ఈ చిత్రం. రాధాబెస్సీ (రాధ) వయస్సులో సీనియర్ అయినా ఓ గవర్నమెంట్ అటెండర్ రాజు (సుబ్బారావు) ప్రేమిస్తాడు. అదే టైమ్‌లో రాజు ప్రవర్తన నచ్చి అతని ప్రేమలో పడుతుంది రాధ. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం కూడా తీసుకుంటారు. అలాగే పనీపాటా లేక తిరిగే జోసెఫ్(కార్తీక్ రత్నం) కంచరపాలెంలో అమ్మోరు జిమ్ ఓనర్‌ దగ్గర పనిచేస్తూ సెటిల్మెంట్‌ల పేరుతో గొడవలకు వెళ్తుంటాడు. 
 
ఒకానొక టైమ్‌లో బ్రాహ్మణ కులానికి చెందిన భార్గవి (ప్రణీత పట్నాయక్)ను ప్రేమిస్తాడు. గెడ్డం (మోహన్ భగత్), సలీమా(విజయ ప్రవీణ). అనాధ అయిన గెడ్డం కంచరపాలెం వైన్ షాప్‌లో బాయ్‌గా పనిచేస్తుంటాడు. అదే షాప్‌కి ప్రతి రోజు వచ్చి మందు కొడుతుంది సలీమా అనే వేశ్య. ఆమె మొహం చూడకుండానే ఆమె కళ్లతోనే ప్రేమలో పడతాడు గెడ్డం. అలాగే సలీమా కూడా గెడ్డం ప్రేమలో పడుతుంది.
 
ఇక సుందరం (కేశవ కర్రి), సునీత (నిత్య శ్రీ). వీళ్లది చిన్ననాటి ప్రేమకథ. ఇద్దరూ ఒకే స్కూల్‌లో చదువుకుంటూ ఉంటారు. అలా వారు ప్రేమలో పడతారు. సామాజికంగా చాలా క్లిష్టంగా అనిపించే ఈ నాలుగు జంటల ప్రేమాయణాలు ఎలాంటి మలుపులు తిరిగాయి అనేదే ఈ సినిమా. 
 
నటీనటుల నటన:
ఈ సినిమాలో నటించిన నటీనటులెవ్వరూ తెలుగు ప్రేక్షకులకు అస్సలు ముఖ పరిచయం లేని వారు. అయినా తమ పాత్రలు ఈ నటులు పూర్తి న్యాయం చేశారు. సినిమాలో సహజత్వం కొట్టొచ్చినట్టుగా కనబడింది. ఎవరికి వారే తమ పాత్రల్లో చెలరేగిపోయి నటించారు. ఇక వెండితెరకు కొత్తయిన ఎవరూ కెమెరా ముందు ఆ బెరుకు చూపించలేదు.
 
రాజు పాత్రలో సుబ్బారావు చెలరేగిపోయి నటించాడు. ముస్లిం వేశ్య పాత్ర చేసిన నిర్మాతల్లో ఒకరైన ప్రవీణ పరుచూరి పాత్ర సహజంగా వుంది. కేశవ కర్రి కూడా తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు.
 
యువ సంగీత దర్శకుడు స్వీకర్ అగ‌స్తి అద్భుతమైన మ్యూజిక్‌తో సినిమా స్థాయిని పెంచడమే కాదు అద్భుతంగా ఆకట్టుకున్నాడు. ఆదిత్య జవ్వాడి- వరుణ్‌ ఛాపేకర్ అందించిన సినిమాటోగ్రఫీ కంచెరపాలెం సినిమాకే హైలైట్‌గా నిలిచింది. ప్రతి ప్రేమ్‌ను ఎంతో అందంగా చూపెట్టాడు. విదేశీ లొకేషన్ల కోసం వెంపర్లాడకుండా సినిమా మొత్తంలో 80 శాతం కంచరపాలెం ఊరిలోనే అందమైన లొకేషన్లు వెతికిపట్టి మరి అంతే అందంగా చూపించారు. ఇక ఎడిటింగ్ విషయానికొస్తే… రవితేజ గిరజాల పనితీరు ఆకట్టుకుంది. సినిమాకి కావాల్సిన బడ్జెట్‌తో నిర్మాతలు సక్సెస్ అయ్యారు. 
 
మైనస్ పాయింట్స్: కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం, అందరు కొత్త మొహాలే కావడం
ప్లస్ పాయింట్స్: నటీనటుల నటన, మ్యూజిక్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, కథ, కథనం, దర్శకత్వం, కామెడీ సీన్స్
రేటింగ్: 3.0/5