శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 19 మే 2023 (20:22 IST)

సస్పెన్స్ థ్రిల్లర్ గా ఆకట్టుకునే ప్రయత్నమే హసీనా

hasina poster
hasina poster
చాలా మంది కొత్తతరం సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశాలతో సినిమాలు తీస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. డైరెక్టర్ నవీన్ ఇరగాని అటువంటి ప్రయత్నం చేసారు. కొత్తవారితో చేయడం అంటే సాహసమే. ఈ సినిమాకు తన్వీర్ ఎండీ నిర్మాతగా, ఎస్ రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈరోజే విడుదల అయిన ఈ సినిమా ఎలావుందో చూద్దాం. 
 
కథ:
అభి (అభినవ్) స్మగ్లింగ్, రియల్ ఎస్టేట్ వంటి దందాలు చేస్తూ సీఐ సపోర్టు తో ఎదురుతిరిగిన వాళ్లందర్నీ హత్య చేస్తూ ఉంటాడు. ఓ సారి సీఐ కి ఎదురుతిరుగుతాడు. మరోవైపు  హసీనా (ప్రియాంక డెయ్), థన్వీర్ (థన్వీర్ ఎండీ), సాయి (సాయి తేజ గంజి), శివ (శివ గంగా), ఆకాష్ (ఆకాష్ లాల్)లు అనాథలు. అయినా బాగా చదివి  సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు సంపాదిస్తారు. ఓ సారి హసీనా పుట్టిన రోజున జరిగిన  సంఘటనతో  ఆ నలుగురి జీవితాలు మలుపులు తిరుగుతాయి. ఆ మలుపులో భాగంగా అభి (అభినవ్‌) వస్తాడు. ఆ తర్వాత ఏమి జరిగింది. ఇందులో హసీనా పాత్ర ఏమిటి. తను ఏమిచేసింది. చివరకు అందరూ ఏమయ్యారు అన్నది తెరపై చూడాల్సిందే.
 
సమీక్ష:
సస్పెన్స్ థ్రిల్లర్ కనుక వాటిని దర్శకుడు బాగానే మలిచాడు.  డైరెక్టర్ నవీన్ ఇరగానిలో కొత్తగా చూపించాలనే తపన కనిపించింది. పాత్రలు ఎంపిక సరిపోయింది.  కొన్ని చోట్ల లాజిక్ మిస్ అయ్యేడు. అభినవ్, ప్రియాంక డెయ్, థన్వీర్, సాయి తేజ గంజి, శివగంగా, ఆకాష్ లాల్ కొత్తగా ఉన్న తమ పర్ఫామెన్స్ తో మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారని చెప్పాలి. మిగతా వారు తమ పాత్రలతో మెప్పించారు.
 
సాంకేతికంగా  డైరెక్టర్ ప్రేక్షకులకు కొత్త నటులతో మంచి కథను పరిచయం చేశాడని చెప్పాలి.ఈ సినిమాను చూపించడంలో సక్సెస్ అయ్యాడని చెప్పాలి. పాటలు పరవాలేదు.సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. నిర్మాణ విభాగాలు సినిమాకు తగ్గట్టుగా పనిచేశాయి. కథనంలో చాలావరకు ట్విస్టులతో కూడిన సన్నివేశాలు చూపించాడు. సైబర్ మోసాలు, అకౌంట్ లో నుంచి డబ్బులు మిస్ అవ్వటం, ఫోన్లు ఎలా హ్యాక్ చేస్తారు అనేవి గతంలో వచ్చినా ఇందులో తాను సరికొత్తగా చెప్పే ప్రయత్నం చేసాడు. ఫ్రెండ్స్ ఎలా ఉండకూడదు అన్న పాయింట్ నూ టచ్ చేసాడు.ఫస్టాఫ్ కాస్త స్లోగా అనిపించినా కూడా సెకండ్ హాఫ్ మాత్రం బాగా ట్విస్ట్ లతో సాగింది. ఇంటర్వెల్, ట్విస్టులు, క్లైమాక్స్, నటీనటుల నటన. అయితే కొత్త వారు చేసే పొపాటు ఈయన చేసాడు.  ఫస్టాఫ్ బోరింగ్, కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపించింది. ఏదిఏమైనా సస్పెన్స్ థ్రిల్లర్ కు తగిన  ట్విస్టులు ఉన్నాయి కాబట్టి వారికే బాగా నచ్చుతుంది. 
రేటింగ్: 2.75/5