శుక్రవారం, 1 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 28 నవంబరు 2021 (17:45 IST)

'సిద్ధ'గా వచ్చిన 'చిరుత' - 'ఆచార్య' నుంచి మరో టీజర్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రాంచరణ్ ప్రధాన పాత్రలో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "ఆచార్య". ఈ చిత్రం నుంచి మరో అప్డేట్‌ను ఆదివారం రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ పోషిస్తున్న సిద్ధ పాత్రకు సంబంధించిన టీజర్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. 
 
"ధర్మస్థలికి ఆపదొస్తే.. అది జయించడానికి ఆ అమ్మోరు తల్లే మాలో ఆవహించి మమ్మల్ని ముందుకు పంపుతుంది" అంటూ సిద్ధ పాత్రలో చెర్రీ డైలాగ్ చెప్తారు. ఇది సినిమాపై ఉన్న క్యూరియాసిటీని మరింతగా పెంచేలా చేసింది. 
 
ఆ తర్వాత అటవీ నేపథ్యంలో చెర్రీ పాల్గొన్న కొన్ని యాక్షన్ సన్నివేశాలను కూడా చూపించారు. ఈ టీజర్ చివరలో ఒక  సెలయేరుకు అవతలివైపు చిరుత పిల్ల నీళ్లు తాగుతుంటే.. పెద్ద చిరుత ఠీవీగా నడుచుకుంటూ వెళుతుంది. ఇవతలివైపు చిరుంజీవి, రామ్ చరణ్‌లు దాన్ని సీరియస్‌గా చూస్తుంటారు. ఈ టీజర్ చూస్తే సినిమా మొత్తం నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో సాగుతున్నట్టు తెలుస్తోంది.