శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By pnr
Last Updated : ఆదివారం, 15 జులై 2018 (11:12 IST)

నచ్చిన అమ్మాయిని చూడగానే ఒంట్లో ఓల్టేజ్ పుడుతుంది - లవర్ ట్రైలర్

యువ హీరో రాజ్ తరుణ్ - రిధి కుమార్ జంటగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన చిత్రం లవర్. ఈ చిత్రానికి అన్నిష్ కృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం ట్రైలర్ ఈనెల 14వ తేదీన విడుదల ట్విట్టర్ ఖాతాలో విడుదల చ

యువ హీరో రాజ్ తరుణ్ - రిధి కుమార్ జంటగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన చిత్రం లవర్. ఈ చిత్రానికి అన్నిష్ కృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం ట్రైలర్ ఈనెల 14వ తేదీన విడుదల ట్విట్టర్ ఖాతాలో విడుదల చేశారు. 
 
మొత్తం 1.48 సెకన్ల నిడివి కలిగిన ఈ లవర్‌ ట్రైలర్‌ ఎంతగానో ఆకట్టుకుంటోంది. "ఎవడికో నచ్చిన బైకు నాకెందుకు నచ్చుతుంది నాకు నచ్చినట్టు నేను చేసుకుంటా అది బైకవని, లైఫ్ అవని" అనే డైలాగ్ బాగుంది. 'ఒక్కొక్కరికి ఒక్కొ అమ్మాయిని చూసినప్పుడు ఒంట్లో ఓల్టేజ్ పుడుతుందంటాడు' రాజ్ తరుణ్.
 
'మనం ఈ లోకంలో లేకపోయినా మనల్సి ఎవరైనా తలుచుకున్నారంటే మన జీవితానికి అర్థం వచ్చినట్లే'నని చివర్లో హీరోయిన్ డైలాగ్ ఉంటుంది. ఈ చిత్రం హీరోయిన్లలో మధ్య కెమిస్ట్రీ, వీరిద్దరి మధ్య సన్నివేశాలు బాగున్నాయి. 
 
లవ్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌‌గా తెరకెక్కిన ఈ మూవీలో భారీ యాక్షన్‌ సన్నివేశాలతో రాజ్‌ తరుణ్‌ కొత్త లుక్‌‌లో కనిపిస్తున్నాడు. ఈ మూవీ జూలై 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.