Tamanna: ఓదెల 2లో మేకప్ లేకుండా భైరవి క్యారెక్టర్ చేయడం అదృష్టం : తమన్నా భాటియా
Tamannaa, Ashok Teja, Madhu, Sampath Nandi, Vashishtha Simha
ఓదెల విలేజ్ లో ఒక కష్టం వస్తే ఆ కష్టం పెద్దదైతే ఆ ఊరిలో ఉన్న ఓదెల మల్లన్న నాగ సాధు క్యారెక్టర్ ద్వారా ఎలా పరిష్కరించారనే అనేది కథ తో ఓదెల 2 చిత్రం రూపొందింది. సూపర్ నాచురల్ థ్రిల్లర్ 'ఓదెల రైల్వే స్టేషన్'కి సీక్వెల్ ఇది. అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌పై డి మధు నిర్మించిన ఈ చిత్రంలో తమన్నా నాగ సాధువుగా, మిస్టరీ ఎనర్జీతో కూడిన పాత్రను పోషించారు. ఈ సినిమా ట్రైలర్ నేడు విడుదలైంది. ఏప్రిల్ 17న సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది.
ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ వచ్చిన తమన్నా భాటియా మాట్లాడుతూ, సంపత్ నంది గారు పార్ట్-2 ఐడియా చెప్పినప్పుడు ఎక్సైటింగ్ గా అనిపించింది. ఇది ఈజీ జోనర్ కాదు. ఒక పల్లెటూరి కథని ఇంత ఎక్సైటింగ్ గా థ్రిల్లింగ్ గా చెప్పడం మామూలు విషయం కాదు. డైరెక్టర్ అశోక్ సినిమాని నెక్స్ట్ లెవెల్ లో తీశారు. నేను ఏ సినిమా చేసిన ఆడియన్స్ కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉండాలని కోరుకుంటాను. అలాంటి కొత్త ఎక్స్పీరియన్స్ ని ఇచ్చే సినిమా ఇది. భైరవి క్యారెక్టర్ చేయడం యాక్టర్ గా అదృష్టంగా భావిస్తున్నాను. నా కెరీర్ లో హైయెస్ట్ ఐషాట్ క్లోజప్స్ ఉన్న సినిమా ఇదే. భైరవి క్యారెక్టర్ ని బీలవబుల్, నేచురల్, మ్యాజికల్ గా చూపించడం నిజంగా బిగ్ ఛాలెంజ్. మధు గారు సినిమా ని చాలా గ్రాండ్ గా నిర్మించారు అన్నారు
సంపత్ నంది మాట్లాడుతూ, ఓదెల సినిమా నాకు ఒక ఎమోషన్. నేను ఆ ఊర్లో పుట్టి పెరిగాను. చాలా గౌరవంగా ప్రేమతో ఈ సినిమాని రాసి తీయడం జరిగింది. ఊరిని కాపాడేది ఆ ఊర్లో ఉన్న ఇలవేల్పు దేవుడి గుడి. ఒక లైన్ లో చెప్పాలంటే.. ఓదెల విలేజ్ లో ఒక కష్టం వస్తే ఆ కష్టం పెద్దదైతే ఆ ఊరిలో ఉన్న ఓదెల మల్లన్న నాగ సాధు క్యారెక్టర్ ద్వారా ఎలా పరిష్కరించారనే అనేది కథ. కంటెంట్, స్క్రీన్ ప్లే, విజువల్ వండర్ గా ఉంటాయి. సౌందర్ రాజన్ చాలా అద్భుతమైనటువంటి విజువల్స్ ఇచ్చారు.అజినీష్ అద్భుతమైన మ్యూజిక్ చేస్తున్నారు. ఏప్రిల్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉండే సినిమా. సినిమా ప్రేమించే ప్రేక్షకులు ఎక్కడున్నా ఈ సినిమాని చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భైరవి పాత్రలో తమన్నా గారు చాలా అద్భుతంగా నటించారు. ఈ పాత్ర తమన్నా కోసమే పుట్టింది. ఆమెను వెతుక్కుంటూనే వెళ్ళింది.
20 ఏళ్లుగా తమన్నా గొప్ప డెడికేషన్ తో యాక్టింగ్ చేస్తూ సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా కొనసాగుతుంది. ఇది మామూలు జర్నీ కాదు. నేను పదేళ్ల క్రితం ఏ డెడికేషన్ తనలో చూశానో ఇప్పుడు కూడా అదే డెడికేషన్ తనలో ఉంది. అందుకే ట్వంటీ ఇయర్స్ గా టాప్ చైర్ లో కూర్చుని ఉంది. తను లేడీ సూపర్ స్టార్ ఆఫ్ టాలీవుడ్ ఇండస్ట్రీ అనిపిస్తుంది. తను మరో 20 ఏళ్లు మనందరినీ ఇలానే ఎంటర్టైన్ చేస్తుందని నమ్ముతున్నాను'అన్నారు
ప్రధాన పాత్రధారి వశిష్ట సింహ మాట్లాడుతూ, ఒక మంచి ఉద్దేశంతో మొదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. నేను సంపత్ నందిగారికి పెద్ద అభిమానిని. ఆయన కథ చెప్పిన విధానం నాకు ఎంతగానో ఆకట్టుకుంది. ఓదెల సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఈ సినిమా మొదలు పెట్టడం జరిగింది. ఈ సినిమాలో తమన్నా గారితో కలిసి యాక్ట్ చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. తమన్న గారి డెడికేషన్ కి హ్యాట్సాఫ్. ఇలాంటి సినిమాలు ప్రతి ఆర్టిస్ట్ కి రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు వరకు 40 సినిమాలు చేశాను కానీ ఇందులో నేను ఎప్పుడూ చేయని ఒక పాత్రని ఇచ్చారు. ఆ క్యారెక్టర్ ఆలోచనకి ఆశ్చర్యపోయాను, అద్భుతంగా వచ్చింది. మీరు తెరపై చూడాల్సిందే. మీ అందరి సపోర్టు కావాలి'అన్నారు
నిర్మాత డి మధు మాట్లాడుతూ, చాలా ఆర్గానిక్ గా ఒక విలేజ్ లో జరిగే స్టొరీ ఇది. కంటెంట్ ని నమ్ముకుని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా చేయడం జరిగింది. ప్రతి ఆర్టిస్టు మాకు ఎంతగానో సపోర్ట్ చేసి షూటింగ్ చేశారు. తమన్నా గారు వచ్చిన తర్వాత బడ్జెట్ గురించి ఇంక ఆలోచించలేదు. తమన్నా గారు ఈ సినిమా కోసం కంప్లీట్ గా ట్రాన్స్ఫర్ అయ్యారు. డిఓపి చాలా అద్భుతమైనటువంటి విజువల్స్ ఇచ్చారు. అజనీష్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోరు మ్యూజిక్ అదిరిపోయింది. సంపత్ నందిగారి సూపర్ విజన్, డైరెక్టర్ అశోక్ గారి దర్శకత్వం సినిమాని అద్భుతంగా మలిచి ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూసి ప్రేక్షకులు గొప్పగా ఆస్వాదిస్తారని ఆదరిస్తారని కోరుకుంటున్నాను