గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 అక్టోబరు 2021 (18:22 IST)

ఆకాశ్ పూరి హీరోగా "రొమాంటిక్" - ట్రైలర్ రిలీజ్

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా తెరకెక్కిన చిత్రం 'రొమాంటిక్'. అనిల్ పాదూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాతో, తెలుగు తెరకి కేతిక శర్మ కథానాయికగా పరిచయమవుతోంది.
 
ఈ చిత్రం ఎపుడో షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ, విడుదలకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ నెల 29వ తేదీన విడుదల చేయనున్నట్టుగా చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. 
 
పైగా, విడుదల తేదీకి సమయం చాలా తక్కువగా ఉండటంతో ప్రమోషన్ల వేగం పెంచారు. అందులో భాగంగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. లవ్.. రొమాన్స్.. ఎమోషన్‌తో కూడిన ఈ ట్రైలర్‌ను ప్రభాస్ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు.
 
టైటిల్‌కి తగినట్టుగానే ఈ సినిమా రొమాంటిక్‌గా ఉండనుందనే విషయం, ఈ ట్రైలర్‌ను చూస్తే తెలుస్తోంది. రమ్యకృష్ణ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తోంది. ''చాలామంది మోహానికి పెట్టుకునే పేరు ప్రేమ .. కానీ వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నా అది మోహమే అనుకుంటున్నారు" అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది.