మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (15:32 IST)

భూమివైపు దూసుకొస్తున్న భారీ గ్రహశకలం

asteroid
భారీ గ్రహశకలం ఒకటి భూమివైపు దూసుకొస్తుంది. ఇది గంటకు 67 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తుంది. ఈ గ్రహశకలం కదలికలను గత ఫిబ్రవరి నెలలోనే అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా గుర్తించింది. ప్రస్తుతం ఇది వేగంగా దూసుకొస్తుందని, ఈ నెల ఆరో తేదీన భూమి సమీపంలో నుంచి పోతుందని నాసా వెల్లడించింది. ఇది గురువారం నాడు భూమికి 41 లక్షల కిలోమీటర్ల దూరంలో నుంచి వెళ్లిపోతుందని తెలిపింది. 
 
అంతరిక్షంలో చిన్నా పెద్ద కలిసి మొత్తం 30 వేలకు పైగా గ్రహశకలాలు చక్కర్లు కొడుతున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఇందులో 850 శకలాలు భారీ పరిమాణంలో ఉన్నాయని వారు తెలిపారు. కిలోమీటర్ల కొద్దీ పొడవున్న శకలాలు కూడా ఇందులో ఉన్నాయని వివరించారు. 
 
అయితే, మరో వందేళ్ల వరకూ ఈ గ్రహశకలాలతో భూమికి చ్చే ముప్పేమీ లేదని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. కాగా మంగళ, బుధవారాల్లో కూడా నాలుగు చిన్న చిన్న గ్రహశకలాలు భూమికి దగ్గర్లో నుంచి దూసుకెళుతాయని పేర్కొన్నారు.